సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 10:51:26

పూరీ-బాల‌య్య కాంబినేష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్ !

పూరీ-బాల‌య్య కాంబినేష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్ !

నంద‌మూరి బాల‌కృష్ణ రాజ‌కీయాల‌లో ఉన్న‌ప్పట‌కీ, సినిమాల విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త‌ర్వాత  బాల‌కృష్ణ ఏ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడ‌నే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్‌ను ఇటీవ‌ల పూరీ జ‌గ‌న్నాథ్‌.. బాల‌య్య‌కు వినిపించ‌గా, దీనికి ఆయ‌న ఫుల్ ఇంప్రెస్ అయ్యారట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌య్యాక బాల‌కృష్ణ‌తో మూవీ మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు టాక్. గతంలో పూరీ జ‌గ‌న్నాథ్‌, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లోపైసా వ‌సూల్ అనే చిత్రం రాగా, ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌ర‌చింది.