బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 17:00:02

సింహాద్రి చిత్రాన్ని బాల‌య్య‌తో చేయాల‌నుకున్న రాజ‌మౌళి..!

సింహాద్రి చిత్రాన్ని బాల‌య్య‌తో చేయాల‌నుకున్న రాజ‌మౌళి..!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌నో లేదంటే వేరే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో కొన్ని ప్రాజెక్ట్‌కి నో చెప్పిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి .అయితే ఆ త‌ర్వాత వేరే హీరోల‌తో తెర‌కెక్కిన స‌ద‌రు చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌వితేజ త‌దిత‌ర హీరోలలో జ‌రిగాయి. ఇలాంటిదే బాల‌య్య కెరీర్‌లో జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.  

ఓట‌మెరుగని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి 17 ఏళ్ళ క్రితం బాల‌కృష్ణ‌తో సింహాద్రి సినిమా చేయాల‌నుకున్నారు. కాని అప్ప‌టికే బాల‌కృష్ణ ఫ్యాక్ష‌న్‌కి సంబంధించిన సినిమాలు చాలా చేయ‌డంతో రిజెక్ట్ చేశారట‌. వెంట‌నే రాజ‌మౌళి .. ఎన్టీఆర్‌ని సంప్ర‌దించి  ఆ స్క్రిప్ట్ చెప్ప‌డంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ట‌. మ‌రి సింహాద్రి చిత్రం ఎంత‌టి భారీ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు 


logo