శనివారం 30 మే 2020
Cinema - Apr 26, 2020 , 08:00:27

దివ్యాంగులకు నిత్యావసరాలు అందజేసిన నందమూరి బాలకృష్ణ

దివ్యాంగులకు నిత్యావసరాలు అందజేసిన నందమూరి బాలకృష్ణ

క‌రోనా సంక్షోభం వ‌ల‌న చాలా మంది తిండి త‌ప్ప‌లు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. వారు ప‌రిస్థితిని గ‌మ‌నించిన ప్ర‌ముఖులు విరాళాలు అందించ‌డంతో పాటు నిత్యావ‌స‌రాలు అంద‌జేస్తున్నారు. తాజాగా న‌టుడు, బసవతారకం హాస్పిటల్ ఛైర్మ‌న్ బాలకృష్ణ త‌న ఆసుప‌త్రిలోని  సెక్యూరిటీ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వాళ్లకు, హాస్పిటల్‌లో పనిచేస్తున్న దివ్యాంగులకు, పారా మెడికల్ సిబ్బందికి పారా మెడికల్ సిబ్బందికి  నిత్యావ‌స‌రాలు అంద‌జేశారు. సంస్థలో పనిచేస్తున్న వారందరి సేవలను ప్రోత్సహించేలా వాటిని అందజేసినట్టు బాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే బాలకృష్ణ‌ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన‌ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల కోసం మొత్తంగా రూ. 1 కోటి 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే.


logo