బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:00:40

ఇళ‌య‌రాజా నోటీసుల‌తో చాలా బాధ‌ప‌డ్డ బాలు

ఇళ‌య‌రాజా నోటీసుల‌తో చాలా బాధ‌ప‌డ్డ బాలు

సినీ సంగీత పరిశ్ర‌మ‌లో బాలు, ఇళ‌య‌రాజాలకి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాలు క‌లిసి ఎన్నో అద్భుత‌మైన బాణీలు అందించారు. అయితే వ‌ర‌ల్డ్ టూర్‌లో భాగంగా ప‌లు దేశాల‌లో క‌చేరీలు చేస్తున్న బాలు ఎక్కువ‌గా ఇళ‌య రాజా స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌లే పాడుతుండ‌డంతో బాలుకి నోటీలు పంపారు ఇళ‌య‌రాజా. ఇంకెప్పుడు త‌‌న పాటలు పాడ‌కూడ‌ద‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు మ్యూజిక్ మ్యాస్ట్రో.

ఇళ‌య‌రాజా పంపిన లీగ‌ల్ నోటీసుల‌తో క‌ల‌త చెందిన బాలు ఏడాది పాటు ఆయ‌న పాట‌లు పాడ‌లేదు. అయితే ఇళ‌య‌రాజా పాట‌లు నేను ఎక్కువ పాడాను. అందులో నాకు భాగ‌స్వామ్యం ఉంటుంది. అందుకే మ‌ళ్లీ పాడ‌టం మొదలు పెట్టా అని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. అతను చట్టపరంగా చర్యలు తీసుకుంటే నేను కూడా చట్టపరంగానే సమాధానం చెప్పాలనుకున్నా. కాక‌పోతే బాధంతా ఏంటంటే ఒక మిత్రుడికి ఆయన లీగల్‌నోటీస్‌ ఇవ్వడం సరికాదని అనిపించింది.ఆయన పాటలు నాకు ఇష్టం. పాడతాను. ఆపను. ఆయన ఇలా చేశారని ఎప్పుడూ గౌరవం తగ్గదు. ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయన కాళ్లకు ఎప్పుడూ నమస్కరిస్తా అని బాలు పేర్కొన్నారు. 


logo