సెలబ్రిటీల ప్రేమ పెళ్లికి సంబంధించి ఎన్నో పుకార్లు వింటుంటాం. కొన్ని సార్లు ఆ పుకార్లు నిజం అవుతుండగా,మరికొన్నిసార్లు అబద్ధంగానే మిగిలిపోతుంటాయి. దర్శకుడు శివ సోదరుడు, ఫేమస్ నటుడు బాలా పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ నడుమ ఎలిజబెత్ ఉదయన్ అనే వైద్యురాలిని సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు బాలా.
ఓనం పండుగ నాడు ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కగా, ఆ తర్వాత రిసెప్షన్ కూడా జరుపుకున్నారు.రిసెప్షన్లో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన బాలా తనపై వచ్చిన పుకార్లన్నింటికి పులిస్టాప్ పెట్టాడు. అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బాలాకు గతంలో ఓ సారి పెళ్లి జరిగి అది పెటాకులయింది. 2010లో ప్లేబ్యాక్ సింగర్ అమృత సురేశ్‌ను పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. వీరికి అవంతిక అనే కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా బాలా.. రజనీకాంత్ నటించిన అన్నాత్తె చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు.