బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 14:15:38

జగ్గూ భాయ్ తో బాహుబలి మేకర్స్‌ వెబ్‌సిరీస్‌..?

జగ్గూ భాయ్ తో బాహుబలి మేకర్స్‌ వెబ్‌సిరీస్‌..?

లెజెండ్‌ చిత్రంతో నటుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ షురూ చేశాడు టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగపతిబాబు. ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫాంల వాహ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే జగ్గూ భాయ్‌ రెండేళ్ల క్రితమే గ్యాంగ్‌స్టర్స్‌ చిత్రంతో డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ యాక్టర్‌ తాజాగా మరోసారి వెబ్‌సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నట్టు ఫిలింనగర్‌ లో వార్త చక్కర్లు కొడుతోంది. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కామీడియావర్క్స్‌ ఈ వెబ్‌సిరీస్‌ను చేసేందుకు సన్నాహాలు చేస్తుందట.

ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ వెబ్‌సిరీస్‌ సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే జగ్గూభాయ్‌ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడం ఖాయమైనట్టేనంటున్నారు ఫాలోవర్లు. ఈ వెబ్‌సిరీస్‌లో నటీనటుల వివరాలు, ఇతర సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

తాజావార్తలు


logo