శనివారం 29 ఫిబ్రవరి 2020
ప్ర‌భుదేవ లుక్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్

ప్ర‌భుదేవ లుక్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్

Feb 15, 2020 , 08:40:20
PRINT
ప్ర‌భుదేవ లుక్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్

ద‌ర్శ‌కుడిగా  స‌త్తా చాటుతున్న ప్ర‌భుదేవ మ‌ళ్ళీ న‌టుడిగా సౌత్ సినిమాలు చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం బఘీర అనే టైటిల్‌తో త‌న 55వ చిత్రం చేస్తున్నాడు. అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భుదేవ లుక్ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైంద‌ని తెలుస్తుండ‌గా, స‌మ్మ‌ర్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. అమైర ద‌స్తూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చిత్రంలో ప్ర‌భుదేవ లుక్స్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ అంటున్నారు. ప్ర‌భుదేవ రీసెంట్‌గా స‌ల్మాన్‌, సుదీప్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌బాంగ్ 3 చిత్రం తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.  


logo