హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ సుజల్ స్వచ్ఛ సంగ్రాహాలో తెలంగాణలోని ముఖరా(కె) గ్రామానికి చోటు దక్కించుకుంది. 100 శాతం బహిరంగ మలవిసర్జన హోదాను సాధించడంతో పాటు అనేక ఇతర అంశాల్లో గ్రామం సాధించిన విజయాలకు గుర్తుగా ఈ గ్రామాన్ని కేంద్రం ఎంపికచేసింది. ఆదర్శ గ్రామ విజయాలను తెలుపుతూ సంబంధిత వీడియోను https://sujal-swachhsangraha.gov.in వెబ్సైట్లో పోస్ట్ చేసింది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గ్రామం ముఖరా(కె). పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఓడీఎఫ్ ప్లస్ సాధించిన గ్రామం. ఇంటింటికి చెత్త సేకరణ, 100 శాతం కంపోస్ట్ అమ్మకం, 100 శాతం ఇంకుడు గుంతలు, పల్లె ప్రకృతి వనం, ఆధునిక శశ్మానవాటిక, ఇంటింటికి వందశాతం నల్లా కనెక్షన్ వంటి అంశాలను సైట్లో పొందుపరిచింది.