ఆదివారం 24 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 22:05:18

బాబు బుజ్జి.. మళ్లీ థియేటర్లకు వచ్చి ఏం చేస్తావ్.?

బాబు బుజ్జి.. మళ్లీ థియేటర్లకు వచ్చి ఏం చేస్తావ్.?

హైదరాబాద్‌ :  ఇప్పుడైతే ఈ అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. ఎందుకంటే జనవరి 1న ఒరేయ్ బుజ్జిగా సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. ఆ మధ్య దసరా సందర్భంగా ఆహాలో విడుదలైంది. ఈ సినిమాకు అప్పుడు ఊహించనంత రెస్పాన్స్ రాలేదు. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరో హీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ ఒరేయ్ బుజ్జిగా ఈ సినిమాను తెరకెక్కించాడు. కె.కె.రాధామోహన్‌ నిర్మించిన  ఈ చిత్రం నూత‌న సంవ‌త్సర కానుక‌గా జ‌న‌వ‌రి 1న థియేట‌ర్‌ల‌లో  విడుద‌ల‌వుతుంది. ఇది ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది. ఇప్పటికే డిజిటల్ మీడియాలో విడుదలైన సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేసి ఏం చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా అది ఫ్లాప్ సినిమా. 

అయినా కూడా మరోసారి థియేటర్లకు ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ 2021కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్సర కానుక‌గా మా బేన‌ర్‌లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేస్తున్నాం అని తెలిపాడు. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాను మళ్లీ విడుదల చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఒరేయ్ బుజ్జిగా విడుదలైనప్పుడు ఆహాలో డిజిటల్ వ్యూస్ కూడా ఎక్కువగా రాలేదు. పైగా రాజ్ తరుణ్ ట్రాక్ రికార్డ్ కూడా అంత బాగోలేదు. మరి అలాంటి హీరో సినిమాలో ఇప్పుడు థియేటర్లో విడుదల చేసి ఏం చేస్తారో చూడాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo