శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 08:09:04

ఐదేళ్ళు పూర్తి చేసుకున్న బాహుబ‌లి

ఐదేళ్ళు పూర్తి చేసుకున్న బాహుబ‌లి

తెలుగు సిని‌మా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ని ఎల్ల‌లు దాటించిన చిత్రం బాహుబలి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భాస్‌,రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. సినిమా రిలీజ్‌కి ముందే వారి వారి పాత్ర‌ల‌తో పోస్ట‌ర్స్ విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాడు రాజ‌మౌళి. తెలుగు సినిమాగా రూపొందిన ఈ చిత్రం రిలీజ్ త‌ర్వాత దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టించింది.

బాహుబ‌లి సినిమా కోసం దాదాపు నాలుగేళ్ళ కాల్షీట్స్ కేటాయించిన‌ ప్ర‌భాస్ ఈ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా పేరొందాడు. చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఇక రానా భ‌ళ్ళాల‌దేవుడిగా, అనుష్క దేవ‌సేన‌గా, ర‌మ్య‌కృష్ణ రాజ‌మౌత శివ‌గామిగా, స‌త్య‌రాజ్ క‌ట్ట‌ప్పగా, త‌మ‌న్నా అవంతిక పాత్ర‌ల‌లో న‌టించిన అల‌రించారు. సినీ ప్రేక్ష‌కుల‌కి కనుల విందుగా మారిన బాహుబ‌లి చిత్రం విడుద‌లై నేటికి ఐదేళ్ళు పూరైంది. జూలై 10,2015న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేశారు.

బాహుబ‌లి సినిమా రిలీజ్ త‌ర్వాత ఈ పేరు అంత‌టా మారుమ్రోగింది. రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ పేరుతో త‌మ లీడ‌ర్స్‌ని  పోల్చుకున్నారంటే  ఈ సినిమా రేంజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తి ఫ్రేంని హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కించిన జ‌క్క‌న్న సినిమా క్లైమాక్స్‌లో బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌నే స‌స్పెన్స్‌తో సీక్వెల్‌పై అంద‌రి దృష్టి ప‌డేలా చేశాడు. ఈ ఒక్క ప్ర‌శ్న బాహుబ‌లి 2 రిలీజ్ వ‌ర‌కు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కీర‌వాణి సంగీతం కూడా సినిమాకి చాలా ప్ల‌స్ అయింది. ఐదేళ్లు పూర్తైన సంద‌ర్భంగా నిర్మాత శోభు త‌నయుడు కార్తికేయ ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo