ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 18:13:20

చైనీస్ యాప్స్ నిషేదించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన బీటౌన్

చైనీస్ యాప్స్ నిషేదించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన బీటౌన్

భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో టిక్ టాక్ లాంటి చైనా యాప్స్ అనేక సెక్యూరిటీ సమస్యలకు కారణం అవుతాయని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 59 చైనీస్ యాప్స్‌పై నిషేదం విధించింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం సినిమా, టీవీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన పలువురు ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం మన దేశాన్ని, జీవన విధానాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థను వారు గౌరవించినంత కాలం..చైనా యాప్స్ మనం బ్యాన్ చేయకూడదు అన్నారు.

చైనీస్ యాప్స్ నిషేదంపై స్పందించిన మ‌లైకా అరోరా.. లాక్‌డౌన్‌లో విన్న బెస్ట్ న్యూస్ ఇదే అంటూ ట్వీట్ చేసింది.ఇక శ‌ర‌రాత్ ఫేం క‌ర‌ణ్‌వీర్ బోరా.. చైనీస్ అప్లికేష‌న్స్ నిషేదించ‌డం గొప్ప విష‌యం అని అన్నారు. మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం సంతోషాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ఇక కుశాల్ టాండ‌న్ స్పందిస్తూ.. చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా చైనీస్ అప్లికేష‌న్స్‌పై మండిప‌డుతున్న కుశాల్ ముఖ్యంగా టిక్‌టాక్‌ని బ్యాన్ చేయ‌డంపై ఆనందం వ్య‌క్తం చేశాడు. 

టిక్‌టాక్‌ని బ్యాన్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఫైన‌ల్‌గా మ‌న దేశాన్ని మ‌నం ర‌క్షించుకోగ‌లిగాం అని నియా శ‌ర్మ అన్నారు. మ్యూజిక్ కంపోజ‌ర్ విశాల్ ద‌డ్లాని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చైనీస్ యాప్స్‌పై సంతోషం వ్య‌క్తం చేస్తూ ప‌లు ట్వీట్స్ చేశారు


logo