సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 08:58:09

బీబీ స్టార్ అవార్డ్స్ వేడుక‌.. ఎమోష‌న‌ల్ అయిన హౌజ్‌మేట్స్

బీబీ స్టార్ అవార్డ్స్ వేడుక‌.. ఎమోష‌న‌ల్ అయిన హౌజ్‌మేట్స్

ఇంటి స‌భ్యులు తీసిన ప్రేమ మొద‌లైంది  ప్రీమియ‌ర్ షోను ప్ర‌ద‌ర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అఖిల్‌, మెహ‌బూబ్ క‌టౌట్స్ ని హౌజ్‌లో ఏర్పాటు చేయ‌గా, వాటిని చూసి చాలా సంతోషించారు. ప్రేమ మొద‌లైంది సినిమాని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన   బిగ్ స్క్రీన్‌లో ప్ర‌ద‌ర్శించ‌గా, ఇందులో అఖిల్‌గా యాంగ్రీ స్టార్ అఖిల్, స్రవంతిగా ఎమోషనల్ స్టార్ మోనాల్, సుబ్బలక్ష్మిగా లౌడ్ స్టార్ అరియానా, ఏడుకొండలుగా బ్యాచ్‌లర్ స్టార్ అవినాష్, మెహబూబ్‌గా మజిల్ స్టార్ మెహబూబ్ కనిపించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే బిగ్ బాస్ కాలేజీలో అఖిల్, స్ర‌వంతి, సుబ్బ‌ల‌క్ష్మీ చ‌దువుతూ ఉంటారు. స్ర‌వంతి, సుబ్బ‌ల‌క్ష్మీలు అఖిల్‌పై మ‌న‌సు పారేసుకుంటారు. కాని అఖిల్‌కి స్ర‌వంతి అంటే ఎక్కువ ఇష్టం. ఇక ఊరు నుండి సుబ్బ‌ల‌క్ష్మీ బావ ఏడుకొండ‌లు పెట్టె బేడా స‌ర్ధుకొని బిగ్ బాస్ కాలేజ్‌కి వ‌స్తాడు. అంతా వెతుక్కుంటూ వ‌చ్చిన మ‌ర‌ద‌లిని క‌లిసి ఏడుకొండ‌లు త‌న ప్రేమ‌ని వ్యక్త‌ప‌రుస్తాడు. అప్పుడు సుబ్బ‌ల‌క్ష్మీ నీపై నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ద‌యచేసి నాపై అలాంటి ఆశ‌లు పెట్టుకోకు అని చెబుతుంది.

ఇంత‌లో మెహ‌బూబ్ అనే పోకిరి సుబ్బ‌ల‌క్ష్మీని ఏడ్పిస్తుండ‌గా, ఏడుకొండలు త‌న మ‌ర‌ద‌లిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తాడు. అత‌డిని మెహ‌బూబ్ బాగా కొట్ట‌డంతో గాయాల పాల‌వుతాడు. అయితే సుబ్బ‌ల‌క్ష్మీని అఖిల్ కాపాడి మెహ‌బూబ్‌ని జైలుకి పంపిస్తాడు. ఇంట‌ర్వెల్ త‌ర్వాత జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మెహ‌బూబ్ ఈ సారి స్రవంతిని చంపే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ క్ర‌మంలో ఏడుకొండలు మెహ‌బూబ్ త‌ల‌పై గ‌ట్టిగా బాద‌డంతో కింద ప‌డిపోయిన ఈ పోకిరిని అఖిల్ అంత‌మొందిస్తారు. ఆ త‌ర్వాత  అఖిల్-స్రవంతి, ఏడుకొండలు-సుబ్బలక్ష్మి జంటలు ఒక్కటవుతాయి. మ‌ధ్య‌లో రెండు జంటలు మాట్లాడుకోవ‌డానికి దాబాకి వెళ్ళ‌గా అక్క‌డ ఐటెం సాంగ్ న‌డుస్తుంటుంది. ఆ ఐటెం సాంగ్‌లో హారిక‌,నోయ‌ల్‌లు త‌మ డ్యాన్స్ తో అద‌ర‌గొట్టేశారు. 

ప్రేమ మొద‌లైంది అనే సినిమాని చూసిన ఇంటి స‌భ్యులు చాలా ఎమోష‌నల్ అవుతూనే సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రీమ‌యర్ పూర్తైన త‌ర్వాత అవార్డుల ప్ర‌ధానోత్స‌వం కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి లాస్య , నోహైల్‌లు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించి అవార్డులు అందించారు. బెస్ట్ యాక్టర్  అవార్డు  అవినాష్ కి దక్క‌గా,  ఆల్ గల్స్ హాట్ టోంబ్ - అఖిల్, రాకింగ్ డీఓపీ - నోయల్, బెస్ట్ బాడీ విలన్ - మెహబూబ్,  బెస్ట్ స్టైలిస్ట్ - లాస్య,  డ్రీమ్ గర్ల్ - మోనాల్,  మిర్చి అవార్డ్ - అరియానా, ఔట్‌స్టాండింగ్ కొరియోగ్రాఫర్ - రాజశేఖర్ మాస్టర్, ఐటమ్ రాణి - హారిక, బెస్ట్ అప్‌కమింగ్ డైరెక్టర్ - అభిజీత్, జ్యూరీస్ స్మార్ట్ అవార్డ్ - దివి, 

ఐటమ్ రాజా అవార్డ్  - సోహెల్ అందుకున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో అవార్డ్స్ అందుకోవ‌డంపై  అఖిల్, మెహ‌బూబ్ చాలా సంతోషం వ్య‌క్తం చేశారు. లాస్య త‌న‌కు వ‌చ్చిన అవార్డుని త‌న కుమారుడితో పాటు మేక‌ప్ మెన్స్, హెయిర్స్ డ్రెస్స‌ర్స్ కి అంకితం చేసింది. ఇక చివ‌ర‌లో జంట‌లు జంటలుగా స్టేజ్ పై డ్యాన్స్ లు చేశారు. దివి-రాజ‌శేఖ‌ర్, సోహైల్- మోనాల్‌, లాస్య‌-మెహబూబ్, అరియానా- అవినాష్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అల‌రించారు. చివ‌ర‌కు అందరు క‌లిసి బంగారు కోడిపెట్ట అనే పాట‌కు చిందులేస్తూ ఫుల్ ఖుష్ అయ్యారు.