గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 15:47:48

తాప్సీ పన్ను@ 33ఇయర్స్‌

తాప్సీ పన్ను@ 33ఇయర్స్‌

ముంబై: బాలీవుడ్‌ అందాల నటి తాప్సీ పన్ను శనివారం తన 33వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నది. ఆమెకు బాలీవుడ్‌ ప్రముఖులంతా బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ఆమెతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. 

ఈ వీడియో షూటింగ్‌ సందర్భంగా తీసింది. ఇందులో ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘హ్యాపీ బర్త్‌ డే తాప్సీ, నీతో ఇంకొన్ని చిత్రాలు కలిసి నటించాలని ఆశిస్తున్నా.’ అని ఖురానా క్యాప్షన్‌ జోడించాడు. తాప్సీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటులు రితేశ్‌ దేశ్‌ముఖ్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఉన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo