సోమవారం 01 జూన్ 2020
Cinema - May 23, 2020 , 09:06:02

విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌లేదు: పాకిస్తాన్ న‌టి

విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌లేదు:  పాకిస్తాన్ న‌టి

పాకిస్థాన్‌లో శుక్ర‌వారం ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘పీకే-8303’ విమానం శుక్రవారం మధ్యాహ్నం  ఒంటిగంట‌కి లాహోర్ నుండి బ‌య‌లుదేర‌గా, 2:45 గంటలకు కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. కాని అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. క్రాష్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని జనావాసాలపై కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 107 మంది మరణించినట్టు కరాచీ మేయర్‌ ప్రకటించారు

విమాన ప్ర‌మాదంలో అయేజా ఖాన్ ఆమె భ‌ర్త డానిష్ మ‌ర‌ణించార‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. ఈ వార్త‌ల‌ని ఖండిస్తూ అయేజా త‌న సోష‌ల్ మీడియాలో పేజ్‌లో పోస్ట్ పెట్టారు. ద‌యచేసి ఫేక్ న్యూస్‌ల‌ని స్ప్రెడ్ చేయ‌కండి.  విష‌యాన్ని నిర్ధార‌ణ చేసుకోకుండా ద‌య చేసి పుకార్లు పుట్టించ‌కండి. ఇలాంటి విషయాల‌లో కాస్త తెలివిగా వ్య‌వ‌హ‌రించండి. త‌ప్పుడు వార్త‌ల‌ని రాసేవారిని త‌ప్పక శిక్షిస్తాడు అని కామెంట్ పెట్టింది. 


logo