ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 18, 2020 , 12:57:06

నేను ఇంటికెళ్తా నన్ను పంపించడి.. బిగ్‌బాస్‌తో గంగవ్వ

నేను ఇంటికెళ్తా నన్ను పంపించడి.. బిగ్‌బాస్‌తో గంగవ్వ

సెకండ్ వీక్‌లో అంద‌రూ అనుకున్నట్టుగానే గురువారం ఎపిసోడ్‌లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సెట్స్ లో ఏసీ గ‌దులుండ‌టంతో గంగ‌వ్వ‌కు ఆ గాలి ప‌డ‌క‌..అస్వ‌స్థ‌త‌కు లోనైంది. వెంట‌నే గంగ‌వ్వ‌ను డాక్ల‌ర్ల‌కు చూపించారు. మ‌రి ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసుకుందాం. .ఉద‌యం పాట‌కు బ‌దులుగా వాయిస్ ఓవ‌ర్ తోనే ఇంటిస‌భ్యులంతా నిధ్ర‌లేచారు. అవినాష్ బిగ్ బాస్ హౌజ్ లోకి రాక‌ముందే ఈ రోజు నా రోజు అంటూ చెప్పుకొచ్చాడు. సంతోషానికి, బాధ‌కు మ‌ధ్య న‌లిగిపోయే చిన్న ప‌దం జోక‌ర్. ఆ జోక‌ర్ వెనుకే జీవితం ఉందంటూ ఏవీ చూపించారు. ఆ త‌ర్వాత అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించే జోక‌ర్ గా ఇక్క‌డికొచ్చానంటూ బిగ్ బాస్ హౌజ్ లోకి ప్ర‌వేశించాడు. మోనాల్ ద‌గ్గ‌ర పెళ్లి ద‌ర‌ఖాస్తు..

అవినాష్ ఇంట్లోకి వ‌చ్చీ రాగానే త‌న‌కు ఓ పెద్ద కుటుంబం ఉంద‌ని, త‌న గురించి ఆలోచించాల‌ని మోనాల్ ద‌గ్గ‌ర‌కెళ్లి పెళ్లికి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు. అనంత‌రం కంటస్టెంట్స్ క‌రాటేక‌ళ్యాణిని బ‌య‌ట పెట్టాల‌నుకున్నా వాళ్ల ప్లాన్ వ‌ర్క‌వుట్స్ కాలేదు. అయితే సుజాత‌ను నోయ‌ల్ స‌క్సెస్‌ఫుల్ గా బ‌య‌ట‌పెట్టాడు. కానీ ఆ భ‌యం నుంచి బ‌య‌ట‌కు రాని సుజాత మాత్రం వెక్కివెక్కి ఏడువ‌గా..నోయ‌ల్ ఆమెను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఊరుకుంచే ప్ర‌య‌త్నం చేశాడు. మరోవైపు బిల్డ‌ప్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ను..ఇంటి స‌భ్యులంతా క‌లిసి అమ్మాయిగా రెడీ చేశారు. ఆ త‌ర్వాత అవినాష్ ను గంగ‌వ్వ‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేయించారు. 

ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో భాగంగా..హారిక ఇంట్లో ఉండే ఓ అబ్బాయిని నువ్వు ఎంపిక చేసుకోవాల‌ని సుజాత‌ను కోరింది. అభిజిత్ పేరు చెప్తావా అని సుజాత‌ను అడుగ‌గా..ఛీఛీ సుజాత నాకు చెల్లిలాంటిద‌ని అన్నాడు. అభిజిత్ మాట‌ల‌తో బాధ‌ప‌డుతూ మ‌రోసారి ఏడుపందుకుంది సుజాత‌.

2 నెల‌లుందామనుకున్నా..కానీ: గ‌ంగ‌వ్వ‌
అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న గంగ‌వ్వ‌ను బిగ్ బాస్ క‌న్ఫెష‌న్ రూంలోకి పిలిచాడు. గంగ‌వ్వ‌ను ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగాడు. త‌న‌ను అంతా బాగానే చూసుకుంటున్న‌రు, కానీ త‌న భ‌ర్త కొట్టిన దెబ్బలు మ‌ళ్లీ త‌న‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని, ఇక్క‌డున్న ఏసీ వాతావ‌ర‌ణం, తిండి త‌న‌కు ప‌డ‌టం లేద‌ని గోడు బిగ్ బాస్ తో త‌న బాధ‌చెప్పుకుంది గంగ‌వ్వ‌. తాను 2 నెల‌లుందామ‌ని ఇక్క‌డికొచ్చాను. కానీ త‌న వ‌ల్ల కావ‌డం లేద‌ని చెప్పింది. 

మీరు గట్టి మ‌నిషి అని..ఇలాంటి ఎన్నో క‌ష్టాల‌న చూసి ఇక్క‌డిదాకా వ‌చ్చార‌ని గంగ‌వ్వ‌కు ధైర్యం చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా..తాను ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ని, ఇంట్లో నుంచి పంపించేయాల‌ని కోరింది. దీంతో గంగ‌వ్వ‌ను మెడిక‌ల్ రూంకు పంపించి డాక్ట‌ర్ల‌తో చికిత్స‌నందించారు. అయితే బిగ్ బాస్ షో చూస్తున్న వారిలో ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌వ్వ‌ను గెలిపించాల‌నుకున్న‌వాళ్లు..బిగ్ బాస్ హౌజ్ లో ఉండేందుకు గంగ‌వ్వ క‌ష్ట‌ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి..ఆమెను ఇంటికి పంపించ‌డమే మేల‌ని అనుకుంటున్నారు. 


బీబీ కామెడీ షో..

ఇక శుక్ర‌వారం ఎపిసోడ్ లో బీబీ కామెడీ షో జ‌రుగ‌నుంది. అమ్మ‌రాజ‌శేఖ‌ర్, అవినాష్ రెండు టీమ్ లుగా విడిపోయి..కామెడీ స్కిట్లు చేయ‌నున్నారు. మ‌రి జ‌బ‌ర్ద‌స్త్ వంటి షోతో కామెడీ పండించిన అవినాష్ టీం గెలుస్తుందా..? డ‌్యాన్స్ చేయ‌డంలో ఆరితేరిన అమ్మ‌రాజ‌శేఖ‌ర్ టీం కామెడీ పండిస్తుందా..?  తెలియాలంటే వేచి చూడాల్సిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.