మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 09:24:42

లాంత‌ర్ ప‌ట్టుకొని స్మ‌శానంలో తిరిగిన అవినాష్‌

లాంత‌ర్ ప‌ట్టుకొని స్మ‌శానంలో తిరిగిన అవినాష్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 బుధ‌వారం ఎపిసోడ్‌లో దెయ్యం ఒక్కొక్క‌రికి చుక్క‌లు చూపించింది. ముందు రోజు దెయ్యంతో హౌజ్‌మేట్స్  ఆట‌లాడితే త‌ర్వాతి రోజు ఆ దెయ్యానికే భ‌య‌ప‌డి వ‌ణికిపోయారు. ఇక ఎపిసోడ్ మొద‌ట్లో  అభిజిత్ ప్ర‌వ‌ర్త‌న గురించి మోనాల్‌.. హారిక‌తో డిస్క‌స్ చేసింది. ఫ్రెండ్ కాద‌ని మొహం మీదే చెప్పేస్తాడు. అసలు ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న నాకు అర్ధం కాదు. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు అంద‌రం క‌లిసి ఉండాలి. బ‌య‌ట‌కు వెళ్లాక ఆయ‌న ఇష్టం ఆయ‌న‌ది. ఫ్రెండ్ కాదంటూ ప్ర‌తీసారి స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం క‌రెక్ట్ కాదంటూ మోనాల్ వాపోయింది 

అనంతరం దెయ్యం జ‌ల‌జ ఇచ్చిన టాస్క్ ప్ర‌కారం సోహైల్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. అనంతరం ఇంటి స‌భ్యుల‌కు జ‌ల‌జ క‌ష్ట‌మైన టాస్క్‌లు ఇస్తూ వారిలో ఎంత ధైర్యం ఉంద‌ని ప‌రీక్షించింది. ఇంట్లో లైట్స్ ఆఫ్ అయిన‌ప్పుడు ఇంటి స‌భ్యులంతా చ‌ప్ప‌ట్లు కొడుతూ న‌వ్వాల‌ని చెప్పింది. ఒక వ్య‌క్తి లాంత‌రు పట్టుకొని గార్డెన్ ఏరియా(స్మ‌శానం సెట‌ప్‌)లో న‌వ్వుతూ తిరుగుతూ ఉండాల‌ని పేర్కొంది. దీంతో అవినాష్ రాత్రంతా లాంత‌ర్ ప‌ట్టుకొని అటు ఇటు తిరుగుతూ న‌వ్వుకుంటూ క‌నిపించాడు. 

ముందు రోజు మాదిరిగానే బుధవారం ఎపిసోడ్‌లోను అవినాష్‌.. దెయ్యంపై జోకులు వేశాడు. ఏంది జ‌ల‌జ నాకు ఈ ప‌రీక్ష‌. రాత్రంతా ఇక్క‌డే ఉండ‌మ‌ని చెప్పావ్‌. నువ్వు ప‌డుకున్నావా అంటూ ఆమెపై సెటైర్స్ కూడా వేశాడు. తెల్ల‌వారుఝామున లైట్స్ బంద్ కావ‌డంతో అంద‌రు లేసి చ‌ప్ప‌ట్లు కొట్టారు


logo