గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 09:32:52

నువ్వు బిగ్ బాస్ షోకు అనర్హురాలివి.. మోనాల్ మొహంపైనే చెప్పిన అవినాష్‌

నువ్వు బిగ్ బాస్ షోకు అనర్హురాలివి.. మోనాల్ మొహంపైనే చెప్పిన అవినాష్‌

సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ ర‌చ్చ‌తో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోతుంది. ఈ సారి హారిక కెప్టెన్‌గా ఉన్నందున ఆమె త‌ప్ప మిగ‌తా ఆరుగురు నామినేష‌న్ టాస్క్‌లో పాల్గొనాల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ తెలిపారు. ఇందులో భాగంగా  గార్డెన్ ఏరియాలో భాగంగా ఉన్న హ్యాట్స్‌ని ధ‌రించాల్సి ఉంటుంద‌ని అన్నారు. బ‌జ‌ర్ మోగ‌గానే ఉరుక్కుంటూ వెళ్లి హ్యాట్స్ ధ‌రించారు ఇంటి స‌భ్యులు. సోహైల్, మోనాల్ మిన‌హా అవినాష్‌, అభిజీత్, అఖిల్‌, అరియానాల‌కు టోపిలో రెడ్ క‌ల‌ర్ ఉండ‌డంతో వారు నామినేట్ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు బిగ్ బాస్.

అయితే త‌ర్వాతి లెవ‌ల్‌గా భాగంగా శ‌వ‌పేటిక‌లో ఉన్న న‌లుగురు నామినేట్ కంటెస్టెంట్స్ బ‌య‌ట ఉన్న సోహైల్, మోనాల్‌ల‌ని ఒప్పించి స్వాప్ చేసుకోవ‌చ్చని తెలిపారు. అందుకు స‌రైన కార‌ణాన్ని తెలియజేయాల‌ని అన్నారు. అవినాష్ ముందు ఈ ప్ర‌క్రియ‌ని ప్రారంభించ‌గా, సోహైల్ తో డీల్ కుదుర్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు. నువ్వు స్ట్రాంగ్ కాబ‌ట్టి నిన్ను ప్రేక్ష‌కులు సేవ్ చేస్తారు. స్వాప్ కావొచ్చు క‌దా అని అవినాష్ అడిగాడు. దీనికి స్పందించిన సోహైల్ .. ఈ నాలుగు వారాలు నాకు చాలా ఇంపార్టెంట్.. నా లక్ కొద్దీ నేను ఇప్పుడు నామినేట్ కాలేదు లేదంటే నేనూ నామినేట్ అయ్యేవాడిని’ , నేను స్వాప్ చేసుకోలేనంటూ చెప్పుకొచ్చాడు సోహైల్.

ఇక సేవ్ అయిన రెండో కంటెస్టెంట్‌తో స్ట్రాంగ్‌తో ఆర్గ్యూ చేశాడు అవినాష్‌. ఇంట్లో ఉండ‌డానికి నీ క‌న్నా నాకే ఎక్కువ అర్హ‌త‌లు ఉన్నాయి. నీ క‌న్నా బాగా ఆడుతున్నా. వ‌చ్చిన‌ప్ప‌టి నుండి టాస్క్‌లో వంద శాతం ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తున్నా. నువ్వు ఇప్పుడిప్పుడే మొద‌లు పెట్టావ్‌..  ‘మొదటి నుంచి ఆట ఆడకుండా.. లాస్ట్‌లో నేను ఆడుతున్నా కప్పు కొట్టేస్తా అంటూ చూస్తూ ఊరుకోరు.. నీకంటే నేను 200 శాతం బెటర్‌గా పెర్ఫామ్ చేస్తున్నానని బల్ల గుద్ది చెప్పగలను. నువ్వు హౌజ్‌లో ఉండేంద‌కు అన‌ర్హురాలివి.. నేను నీకంటే బాగా ఆడుతున్నానని నాకు తెలుసు.. షో చూసే ప్రేక్షకులకు తెలుసు అని అవినాష్ అన్నాడు. దీనికి స్పందించిన మోనాల్‌ నేను నీకంటే స్ట్రాంగ్ అని. బాగా ఆడుతున్నప్పుడు ప్రేక్షకులు ఓట్లు వేస్తారుగా నామినేషన్‌లో ఉండు.. నేను నీ కోసం నామినేట్ కాను అంటూ కుండబద్దలు కొట్టి చెప్పింది మోనాల్.


logo