నామినేషన్ నుండి సేవ్ అయ్యే ఛాన్స్ పొందిన కంటెస్టెంట్ ఎవరు?

నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులు ఎవిక్షన్ పాస్ దక్కించుకునేందుకు ఇంట్లో ఉన్న జెండాలన్నింటిని వెతకసాగారు. చివరకి అఖిల్ 35, అరియానా 17, అవినాష్ 28, మోనాల్ 20 జెండాలను దక్కించుకున్నారు. ఎక్కువ జెండాలు సేకరించిన అఖిల్, అవినాష్ రెండో లెవల్‌కు చేరుకున్నారు. ఈ రెండో లెవల్లో వీరిద్దరు మిగతా ఇంటి సభ్యుల మెప్పు పొంది దండలు వారి మెడలో వేయించుకోవలసి ఉంటుందని బిగ్ బాస్ అన్నారు. ఇంటి సభ్యుల మెప్పు పొందేందుకు అవినాష్, అఖిల్‌లు ప్రచారం మొదలు పెట్టారు.. అవినాష్ గుర్రం గుర్తుని ఎంచుకోగా, అఖిల్ బీబీ సింబల్‌ని ఎన్నుకున్నారు.
అరియానా- అవినాష్ ఓ వైపు, అఖిల్-సోహైల్ మరోవైపు జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ప్రచారాలు చేస్తూ ఎలా స్పీచ్‌లు ఇస్తారా అలానే అఖిల్, అవినాష్‌లు తమ గురించి తాము చెప్పుకున్నారు. ఇక చివరిగా దండలు వేయాల్సిన సమయం రావడంతో అఖిల్‌కు సోహైల్, మోనాల్ సపోర్ట్ చేయగా, అవినాష్‌కు అభిజీత్, అరియానా అండగా నిలిచారు. హారిక దండ ఎవరికి పడితే వాళ్లకే ఇమ్యునిటీ లభించినట్టు.. నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టు. ఆమె ఎవరికి వేస్తుందో అని అంతా టెన్షన్లో ఉండగా, పాతవన్నీ చెప్పుకొచ్చి అవినాష్ మెడలో దండ వేసింది. దీంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకున్నాడు అవినాష్.