శుక్రవారం 15 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 10:30:47

ఎవిక్ష‌న్ పాస్ ఇచ్చి, అందులో చిన్న ట్విస్ట్ పెట్టిన బిగ్ బాస్

ఎవిక్ష‌న్ పాస్ ఇచ్చి, అందులో చిన్న ట్విస్ట్ పెట్టిన బిగ్ బాస్

బిగ్ బాస్ ఆట‌లు ఊహాతీతం. ఎప్పుడు ఏం చేస్తారో ఎవ‌రికి అర్ధం కాదు. నామినేష‌న్‌లో ఉన్న స‌భ్యులు సేవ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఎవిక్ష‌న్ పాస్ పొందొచ్చు అని ఓ టాస్క్ ఇచ్చి ఆడించాడు. అయితే ఈ టాస్క్‌లో విజేత‌గా నిలిచిన అవినాష్ ఎవిక్ష‌న్ పాస్ పొందాడు. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఇచ్చాడు.   ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌కి రెండు వారాల వాలిడిటీ ఉంటుంది మీరు దీన్ని ఈ రెండు వారాల్లో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని చెప్పారు బిగ్ బాస్. 

బిగ్ బాస్ మాట‌ల‌తో క‌న్ఫ్యూజన్‌లో పడ్డాడు అవినాష్. ఈ వారం ఉప‌యోగించుకోవాలా వ‌చ్చే వారం ఉప‌యోగించుకోవాలో తెలియ‌ని డైల‌మాలో ఉన్న అవినాష్‌కు అరియానా స‌పోర్ట్‌గా నిలిచింది. మెల్ల‌గా చెప్పొచ్చులే అన‌డంతో మనోడు కొంత శాంతించాడు. ఇక నామినేష‌న్ స‌మ‌యంలో పోట్లాడిన అఖిల్‌- మోనాల్ లు మ‌ళ్ళీ కొంచెం  కూల్‌గా మాట్లాడుకున్నారు. స్వాప్ గురించి నువ్వు న‌న్ను ఎందుకు అడ‌గ‌లేదు అని మోనాల్ .. అఖిల్‌ని అడిగింది. నాకు స్వాప్ వ‌ద్దు, కొన్ని పాయింట్స్ క్లియర్ చేసుకుందామ‌నే మాట్లాడాను అంటూ అఖిల్ బ‌దులిచ్చాడు

అభిజీత్ ఆడిన డ్రామా గురించి కూడా అఖిల్‌.. మోనాల్‌తో చ‌ర్చించాడు. ముందు స్వాప్ వ‌ద్దు అన్నాడు, త‌ర్వాత హారిక ఇస్తే వెంట‌నే తీసుకున్నాడు. ఒక్క నిమిషం ఆగి నాకు స్వాప్ వ‌ద్దు అని స్టాండ్ ఇవ్వొచ్చు క‌దా. ఎన్నో మాట‌లు చెబుతాడు. మ‌రి ఆ మాట‌లు ఇప్పుడు ఏమ‌య్యాయి అంటూ అభిపై త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు అఖిల్‌. ఇక కిచెన్‌లో ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా దెయ్యంలా ఓ బొమ్మ ప్ర‌త్య‌క్షం అయింది. దీంతో అరియానా కెవ్వున కేక వేసింది. ఇంటి స‌భ్యులు అంద‌రు అక్క‌డికి రావ‌డంతో అది మాయ‌మైంది. అయితే ఆ దెయ్యం ఎవ‌రు?  బిగ్ బాస్ ఎవ‌రినైన రీ ఎంట్రీగా తీసుకొస్తున్నారా, లేదంటే కాసేపు అలా హ‌డావిడి చేశాడా అనేది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది