బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 08:36:58

హారిక‌ని టీజ్ చేసిన అవినాష్‌.. ప‌డిప‌డి న‌వ్విన సోహైల్

హారిక‌ని టీజ్ చేసిన అవినాష్‌.. ప‌డిప‌డి న‌వ్విన సోహైల్

బిగ్ బాస్ సీజ‌న్ 4కు సంబంధించి సోమ‌వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది. అంత‌కుముందు పాట‌తో ఇంటి స‌భ్యులను నిద్ర‌లేపారు బిగ్ బాస్. ఆ త‌ర్వాత ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీ అయ్యారు. మాస్ట‌ర్ బాత్‌రూం ప‌రిస‌రాల‌ను క్లీన్ చేయ‌గా, అవినాష్‌.. హారిక‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. లూజ్ టీష‌ర్ట్ ధ‌రించిన హారికను ఈ టీష‌ర్ట్‌ ఎక్క‌డ తీసుకున్నావ్‌, బాగుంది. లూజ్ టీ ష‌ర్ట్ అంటూ అఖిల్, సోహైల్‌తో క‌లిసి హారిక‌ని ఆట‌ప‌ట్టించాడు.దీంతో ఒళ్ళు మండిన హారిక ఎక్కువ చేస్తే నామినేట్ చేస్తా అని తెలిపింది. 

ఇక హౌజ్‌లో కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న అఖిల్‌, మోనాల్‌ని క‌లిపే ప్ర‌య‌త్నం చేసింది అరియానా. ఈ విషయంపై ముందుగా నోయ‌ల్‌తో చ‌ర్చించి ఆ త‌ర్వాత‌ అభిజి‌త్‌తో మాట్లాడేందుకు ఆయ‌న ద‌గ్గ‌రకు వెళ్ళింది. మోనాల్ పేరుని త‌న ద‌గ్గ‌ర తీసుకొచ్చేస‌రికి కాస్త చిరాకుగా ముఖం పెట్టుకున్న అభిజిత్ ఈ విష‌యం గురించి మాట్లాడ‌క‌పోవ‌డ‌మే మంచిది అన్నాడు. ఆ త‌ర్వాత ఈ ఇష్యూపైననే లాస్య‌, హారిక‌, నోయ‌ల్‌తో క‌లిసి  డిస్క‌ష‌న్ పెట్టాడు. ఇదే క్ర‌మంలో అరియానా విష‌యంలో కొంత నోరు జారాడు.