శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 09:25:32

అవినాష్ మ‌రీ అతి చేస్తున్నాడా..!

అవినాష్ మ‌రీ అతి చేస్తున్నాడా..!

బిగ్ బాస్ సీజ‌న్ 4లో 86వ ఎపిసోడ్‌తో 13 వ వారం మొద‌లైంది. గ‌త వారం ఎవ‌రు ఎలిమినేట్ కావడంతో ప్ర‌స్తుతం హౌజ్‌లో ఏడుగురు స‌భ్యులు ఉన్నారు. ఎవిక్ష‌న్ పాస్ ద్వారా సేవ్ అయిన అవినాష్ అదే పాట పాడ‌డం మొద‌లు పెట్టాడు. ప్రేక్ష‌కులు న‌న్ను పంపించారు.  ఈపాస్‌తో గేమ్ ఆడ‌టం నాకు న‌చ్చ‌డం లేదంటూ సోమ‌వారం ఎపిసోడ్‌లోను త‌న బాధ వెళ్ళ గ‌క్కాడు. అఖిల్‌, సోహైల్ లు ఎంత క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ, ప్రేక్షకులు నా ఆట బాలేదనే కదా.. ఓట్లు వేయలేదు.. నేను ఓడిపోయా.. ఎవిక్షన్ పాస్ వల్లే ముందుకు వెళ్తున్నా. ఎవ‌రి కోసం ఆడాలి, నామినేష‌న్ ఉన్న వాళ్ళ‌లో నేను వీక్ అనే క‌దా అంటూ కాస్త అతి చేశాడు 

ఎవిక్ష‌న్ పాస్‌తో సేవ్ అయ్యానంటే నాకు ఎలానో అనిపిస్తుంది. ముఖం కూడా చూపించుకోలేక‌పోతున్నా. నామినేష‌న్‌లో నా క‌న్నా వీక్ ఉన్న వాళ్లు కూడా ఉన్నారు క‌దా అంటూ కాస్త త‌న‌కు తానే కాస్త ఓవ‌ర్ గా బిల్డ‌ప్ ఇచ్చుకున్నాడు.  అనంత‌రం కిచెన్‌లో అరియానా, సోహైల్, అవినాష్‌లు నామినేష‌న్ గురించి మాట్లాడుకుంటూ న‌న్ను ఎవ‌రు నామినేట్ చేయోద్ద‌రి సోహైల్ అన‌డంతో .. వెంట‌నే అత‌నికి ద‌గ్గ‌ర‌కి వెళ్లిన అరియానా హ‌గ్ చేసుకొని.. నువ్వంటే చాలా ఇష్టం, ఎందుకు మ‌న ఇద్ద‌రికి అలా గొడ‌వ‌లు వ‌స్తున్నాయి. ఈ రెండు వారాలే త‌ర్వాత మ‌నం చిల్ అవ్వొచ్చు అంటూ ఒక‌రిపై ఒక‌రు ప్రేమ కురిపించుకున్నారు.

ఇక కాస్త అలిసిపోయిన‌ట్టు అనిపిస్తుంద‌ని చెప్పి అవినాష్‌, సోహైల్, అఖిల్‌లు బిగ్ బాస్‌కు చెప్పి ప‌డుకున్నారు. కొద్ది సేప‌టి త‌ర్వాత వీరిని నిద్ర నుండి లేపిన బిగ్ బాస్.. నిద్ర అయిపోతే నామినేషన్ ప్ర‌క్రియ మొద‌లు పెడ‌దామని అన్నారు