Avika gor | చిన్నారి పెళ్లికూతురు అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్‌తో అంత బాగా పరిచయం అయింది అవికా గోర్. కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రెచ్చిపోతుంది. ఏకంగా బికినీ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన అవికా గోర్ ఇక్కడ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సినిమాల్లో కూడా బాగానే రెచ్చిపోతుంది అవికా గోర్. మొన్న విడుదలైన నెట్ సినిమాలో అమ్మడు అదిరిపోయే అందాల ఆరబోతతో మతులు పోగొట్టింది. ఒకవైపు హీరోయిన్గా రాణిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థ కూడా మొదలు పెట్టింది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం3 రూపొందుతోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరోగా నటిస్తున్నాడు.
ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ “నా చిన్నతనం నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా. అందుకని, ప్రొడక్షన్లోకి రావాలని అనుకుంటున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను. దాంతో నేనూ ప్రొడక్షన్లో పార్ట్ అవుతానని చెప్పా. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపింది. మరి ఈ ముద్దుగుమ్మ నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
Siri: ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు.. వెక్కి వెక్కి ఏడ్చిన సిరి
Priyanka: నాకు పిల్లలు పుట్టరని అన్నాడు..అమ్మ అయ్యేందుకు లక్షలు ఖర్చు పెట్టా..!
Kajal: తల్లిదండ్రులపైన పోలీస్ కంప్లైంట్ చేసిన కాజల్
Naga Chaitanya: సమంతతో విడాకుల విషయంపై నోరు విప్పిన నాగ చైతన్య
పీఆర్ ఎజెన్సీ పెట్టుకున్న రష్మిక మందన్నా