బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 15:52:55

వ‌ర్క‌వుట్స్ ఆపేయ్‌..అవెంజ‌ర్స్ స్టార్ కు క్రిస్ రిక్వెస్ట్

వ‌ర్క‌వుట్స్ ఆపేయ్‌..అవెంజ‌ర్స్ స్టార్ కు క్రిస్ రిక్వెస్ట్

అవెంజ‌ర్స్ స్టార్ హీరో క్రిస్ హేమ్స్ వ‌ర్త్ కోస్టార్ క్రిస్ ప్రాట్ కాంబినేష‌న్‌లో థొర్‌..ల‌వ్ అండ్ థండ‌ర్ సినిమా వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం క్రిస్ హేమ్స్ వ‌ర్త్ త‌న బాడీ షేప్ ను మార్చుకునే ప‌నిలో ప‌డ్డాడు. కండ‌లు తిరిగిన దేహంతో పెద్ద వీల్ ను నెడుతున్న ఫొటోను క్రిస్ హేమ్స్ వ‌ర్త్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇవాళ అద‌న‌పు వ‌ర్క‌వుట్ చేయాలని నిర్ణ‌యించుకున్నా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.  స్టన్నింగ్ ఈ ఫొటోపై కోస్టార్ క్రిస్ ప్రాట్ త‌న‌దైన స్టైల్ లో కామెంట్టు పెట్టాడు.

 'హేయ్ క్రిస్ హమ్స్ వ‌ర్త్ మ‌నమిద్ద‌రం ఒకే స్క్రీన్ పై క‌నిపించాలి.  నువ్వు సీరియ‌స్ వ‌ర్కవుట్స్ ఆపేయాల‌ని నా ట్రైన‌ర్ కోరుకుంటున్నాడు. ఎందుకంటే అత‌డు న‌న్ను నీ పక్క‌న చూడాల‌నుకోవ‌డం లేదు..మీరు 25 పౌండ్లు పెరిగినందుకు నిజంగా ధ‌న్య‌వాదాలు తెలుపాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ' క్రిస్ ప్రాట్ కామెంట్ పెట్టాడు. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌లో న‌టించిన ఈ ఇద్ద‌రు స్టార్ సెల‌బ్రిటీలు మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్ త‌మ యాక్ష‌న్ తో ప్రేక్ష‌కులను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo