మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 14:08:18

వ‌చ్చే వారం నుండి అవ‌తార్2 ప‌నులు షురూ..!

వ‌చ్చే వారం నుండి అవ‌తార్2 ప‌నులు షురూ..!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన అన్ని ప‌నులు ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఇప్పుడిప్పుడే మొద‌లు అయ్యాయి. షూటింగ్‌లు కూడా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కి అనుగుణంగా జరిపేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2009 హాలీవుడ్ సైంటిఫిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం అవ‌తార్ సీక్వెల్ అవ‌తార్  2 వ‌చ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

త‌దుప‌రి షెడ్యూల్ కోసం చిత్రం బృందం వ‌చ్చే వారం న్యూజిలాండ్‌కి వెళ్ల‌నుంది.  అవతార్ 2 నిర్మాతల్లో ఒకరైన జోన్ లాండౌ త‌న  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాబోయే షెడ్యూల్ గురించి ప్రకటన చేశారు. అంతేకాక జేమ్స్ కామెరూన్ అత‌ని చిత్ర బృందంకి సంబంధించిన బిహైండ్ సీన్స్ కూడా షేర్ చేశారు. స‌ముద్ర గ‌ర్భం నేప‌థ్యంగా సాగే  స‌న్నివేశాలు ఉంటాయ‌ని, వాటికి  సంబంధించి బోట్ సెట్లు ఇవే అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. జో సల్దానా, సామ్ వర్తింగ్‌టన్, కేట్ విన్స్లెట్ మరియు క్లిఫ్ కర్టిస్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 17, 2021న చిత్రం ప్రేక్ష‌కుల ముందు రానున్న‌ట్టు తెలుస్తుంది. మార్చిలో చిత్రం క‌రోనా వైర‌స్ వ‌ల‌న ఆగిపోయిన‌ విష‌యం తెలిసిందే. logo