మంగళవారం 19 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 08:55:57

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

సిడ్నీ వేదిక‌గా మ‌రో స‌మ‌రం మొద‌లైంది. తొలి వ‌న్డేలో ప‌రాజ‌యం పాలైన భార‌త్ ఈ రోజు ఆతిథ్య జట్టు  ఆసీస్‌తో రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధ‌మైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌లో నిలవాల‌ని భార‌త్ భావిస్తుంటే, ఆసీస్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ విజ‌యం సాధించి సిరీస్ ఎగరేసుకుపోవాల‌ని భావిస్తుంది. 

రెండో వ‌న్డేలోను టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కేవ‌లం ఒకే  ఒక్క మార్పుతో ఈ మ్యాచ్‌లోకి బ‌రిలోకి దిగుతుంది. స్టోయినిస్ స్థానంలో హెన్రిక్స్ బ‌రిలోకి దిగుతున్నాడు. ఇక ఇండియా ఎలాంటి మార్పులు లేకుండానే ఆసీస్‌తో పోరాడేందుకు సిద్ధ‌మైంది.  భార‌త జట్టులో సమతూకం లేకపోవడం పెద్ద‌ సమస్యగా మారింది. ఆరో బౌల‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డం, టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ రాణించ‌క‌పోవ‌డం భార‌త్‌కు ఇబ్బందిగా మారింది. 

జట్లు : 

భారత్‌: ధవన్‌, మయాంక్‌, కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, సైనీ, షమీ, చాహల్ ‌, బుమ్రా 

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌(కెప్టెన్‌), స్మిత్‌, లబుషేన్‌, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌