గురువారం 21 జనవరి 2021
Cinema - Jan 08, 2021 , 06:48:42

రెండో రోజు రెండు వికెట్స్ కోల్పోయిన ఆసీస్

రెండో రోజు రెండు వికెట్స్ కోల్పోయిన  ఆసీస్

సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా ప‌ట్టు బిగించింది. అరంగేట్ర ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు), మార్నస్‌ లబ్‌షేన్ (91‌; 11ఫోర్లు) , స్టీవ్ స్మిత్‌( 73; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించ‌డంతో 4 వికెట్ల న‌ష్టానికి 245 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో స్మిత్‌తో పాటు గ్రీన్(0) ఉన్నారు.

గురువారం టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ ప్ర‌త్య‌ర్ధిపై పైచేయి సాధించింది.. బౌలింగ్‌ వైఫల్యం, పంత్‌ క్యాచ్‌లు వదిలేయడంతో ఆస్ట్రేలియా పుంజుకుంది. వ‌ర్షం కార‌ణంగా తొలొ రోజు 55 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే జ‌ర‌గ‌గా   నిర్ణీత‌ ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇక ఓవ‌ర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌కు జ‌డేజా షాక్ ఇచ్చాడు. ల‌బుషేన్‌తో పాటు మాథ్యూ వేడ్‌( 13;2 ఫోర్స్) వికెట్స్ వెంట‌వెంట‌నే తీసాడు. అయితే సొంత మైదానంలో స్మిత్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు రెచ్చిపోతుండ‌డం భార‌త్‌కు ఆందోళ‌న క‌లిగిస్తుంది.  భార‌త బౌల‌ర్స్‌లో జ‌డేజా రెండు వికెట్స్ తీయ‌గా, సైనీ, సిరాజ్‌కు చెరో వికెట్ ద‌క్కింది. 


logo