గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 26, 2020 , 23:15:57

అంతకుమించి

అంతకుమించి

పదేళ్ల ప్రయాణంలో ప్రేమ, కుటుంబ కథాంశాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది సమంత. తొలిసారి  ఆమె భయపెట్టడానికి సిద్ధమవుతోంది. సమంత కథానాయికగా అశ్విన్‌ శరవణన్‌ (‘గేమ్‌ ఓవర్‌' ఫేమ్‌) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. పూర్తిస్థాయి హారర్‌ కథాంశంతో సమంత నటిస్తున్న తొలి సినిమా ఇది. హారర్‌ సినిమాకు మించి ఎన్నో అద్భుతమైన అంశాల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని సమంత బుధవారం ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నది.మహిళా ప్రధాన కథాంశంతోతెరకెక్కనున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రసన్న కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సమంత తమిళంలో విజయ్‌సేతుపతి, నయనతారలతో కలిసి  ‘కాతు వాకుల రెండు కాదల్‌'  సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమాతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ మాధ్యమంలో అరంగేట్రం చేస్తున్నది. మరికొన్ని తెలుగు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.logo