తెలుగు ప్ర‌జ‌లున్నంత‌ వ‌ర‌కు నాన్న ఉంటారు: ఎస్పీ చ‌ర‌ణ్

Sep 25, 2020 , 13:59:16

చెన్నై: ప‌్ర‌‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తుదిశ్వాస విడిచిన‌ నేప‌థ్యంలో ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్ప‌త్రి ఎదుట  ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ నమ‌స్కారం. నాన్న ఇవాళ మ‌ధ్యాహ్నం 1:04 నిమిషాల‌కు క‌న్ను ‌మూశారు. నాన్న కోలుకోవాల‌ని ప్రార్థన‌లు చేసిన అశేష అభిమానులు, ఆయ‌న‌కు సేవ‌లందించిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఆస్ప‌త్రి సిబ్బందికి పేరుపేరునా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. తెలుగు ప్ర‌జ‌లు ఉన్నంత‌వ‌ర‌కు నాన్న త‌మ‌తో ఉంటార‌ని, నాన్న పాట‌లు గుర్తుండిపోతాయ‌ని ఎస్పీ చ‌ర‌ణ్ అన్నారు. ఎస్పీ బాలు అస్త‌మ‌యం నేప‌థ్యంలో ఎంజీఎం ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD