సోమవారం 25 మే 2020
Cinema - Apr 01, 2020 , 09:14:48

కుటుంబంతో క‌లిసి రామాయ‌ణం సీరియ‌ల్‌ చూసిన రీల్ రాముడు

కుటుంబంతో క‌లిసి రామాయ‌ణం సీరియ‌ల్‌ చూసిన రీల్ రాముడు

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఖాళీ స‌మ‌యాన్ని ఎలా వినియోగించాలో తెలియ‌క కొంద‌రు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన దూర‌ద‌ర్శ‌న్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో  ప్ర‌సారం అయిన రామాయ‌ణం సీరియ‌ల్‌ని మ‌ర‌లా ప్ర‌సారం చేస్తుంది. మార్చి 28 నుండి  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్ ప్ర‌సారం అవుతుంది. 

ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసిన రామాయ‌ణం సీరియ‌ల్‌లో రాముడిగా అరుణ్ గోవిల్‌, సీత‌గా దీపిక చిఖ‌లియా, ల‌క్ష్మ‌ణుడిగా సురీల్ లాహిరి న‌టించారు. తాజాగా రీల్ రాముడు అరుణ్ త‌న ఫ్యామిలీతో క‌లిసి రామాయ‌ణం సిరీస్‌ని వీక్షించారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. రీల్ రాముడు.. ఫ్యామిలీతో రియ‌ల్ రాముడిని చూస్తున్నారుగా అంటూ ప‌లు కామెంట్స్ పెడుత‌న్నారు. రామానంద్ సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రామాయ‌ణం సీరియ‌ల్ 33 ఏళ్ల త‌ర్వాత కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది.


logo