శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 10:33:46

ల‌క్ష క‌రెంట్ బిల్‌.. కిడ్నీలు అమ్ముకుంటానంటున్న న‌టుడు

ల‌క్ష క‌రెంట్ బిల్‌.. కిడ్నీలు అమ్ముకుంటానంటున్న న‌టుడు

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో క‌రెంట్ బిల్లులు ల‌క్ష‌లు దాటుతున్నాయి. సెల‌బ్రిటీలు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ దృష్టికి తీసుకెళుతూ ఫ‌న్నీ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సి త‌న ఇంటికి 1,03,564  క‌రెంట్ బిల్ వ‌చ్చింద‌ని, నేను వేసిన పెయింటింగ్స్ కొంటే ఆ వ‌చ్చిన మొత్తంతో విద్యుత్ బిల్ చెల్లిస్తాన‌ని ట్వీట్ చేశాడు. తర్వాతి నెల బిల్ చెల్లించేందుకు ఆ రెండు కిడ్నీల‌ని అమ్మేందుకు సిద్ధ‌మ‌వుతున్నా అంటూ స‌ర‌దాగా మాట్లాడారు అర్ష‌ద్.

ఇప్ప‌టికే ప‌లువురు హీరో, హీరోయిన్‌ల‌కి కూడా ల‌క్ష‌ల‌లో క‌రెంట్ బిల్స్ రావ‌డంతో వారు కూడా త‌మ గోడు వెళ్ల‌బుచ్చారు. న‌టి కార్తీక‌, తాప్సీ, సందీప్ కిష‌న్‌, హ్యుమా ఖురేషి, సోహ అలీ ఖాన్, డినో మోరియా త‌దిత‌రులు తాజాగా వ‌స్తున్న క‌రెంట్ బిల్స్‌పై అస‌హనం వ్య‌క్తం చేస్తూ ట్వీట్స్ చేశారు


logo