మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 10, 2020 , 08:26:31

న‌న్ను పంపించేయండి బిగ్ బాస్ అని వేడుకున్న అరియానా

న‌న్ను పంపించేయండి బిగ్ బాస్ అని వేడుకున్న అరియానా

అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌజ్ నుండి వెళ్ళిపోవ‌డంతో అరియానా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెతో పాటు సోహైల్‌, మొహ‌బూబ్‌లు కూడా గుక్క‌పెట్టి ఏడ్చారు. అయితే అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌజ్ నుండి వెళ్లిపోవ‌డంతో తాను ఏకాకి అయిన‌ట్టు భావించిన అరియానా కెమెరా ముందుకు వచ్చి ఇంటికి పంపించేయండి బిగ్ బాస్‌.ఇక్క‌డ ఉన్న వారెవ‌రు నాకు న‌చ్చ‌డం లేదు. ప్లీజ్ బిగ్ బాస్ అంటూ వేడుకుంది. ఆ త‌ర్వాత అవినాష్‌తో క‌లిసి గార్టెన్ ఏరియాలో కూర్చున్న అరియానా  నాకు ఇక్క‌డ ఉండాల‌ని  లేద‌ని చెప్పుకొచ్చింది. 

ఇక అభిజిత్‌తో క‌లిసి పిచ్చాపాటి పెట్టిన మోనాల్  ప‌క్షుల గురించి మాట్లాడుతూ..హిందీలో పాట పాడింది. దీంతో బిగ్ బాస్.. మోనాల్ తెలుగులో మిట్లాడండి అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ప్ర‌స్తుతం యాక్టివ్ కెప్టెన్‌గా ఉన్న మెహ‌బూబ్ ...మోనాల్ హిందీలో మాట్లాడినందుకు ఆమెను జైలుకు త‌ర‌లించాడు. ఫ్రూట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఏదో గెస్ట్ హౌజ్‌లో ఉన్న‌ట్టు ఫీలైంది. ఇంత‌లో అక్క‌డ‌కు వ‌చ్చిన అఖిల్ .. నువ్వు జైలులో ఉన్న విష‌యం మ‌ర‌చిపోయావా?  ఇంత సంతోషంగా ఉండ‌డం నేనెప్పుడు చూడ‌లేదు. అది జైలు అంటూ ఆమెకు మ‌రోసారి గుర్తు చేశాడు. దీంతో మోనాల్ తెగ న‌వ్వేసింది.


logo