హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ఆయనను చూసి ఎంతో మంది ప్రేరణ పొందారు.ఆర్నాల్డ్ యాక్షన్ సీన్స్‌లో దిట్ట అనే సంగతి మనందరికి తెలిసిందే.అయితే ఈ 73ఏళ్ల సీనియర్ కొన్నేళ్లు కాలిఫోర్నియా గవర్నర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ రాజకీయాల వలన పిల్లలు తనని దూరం పెట్టారని వాపోయాడు. రాజకీయం అనేది తన బిడ్డలకు అసహ్యం కలిగేలా చేసిందని చెప్పుకొచ్చాడు.
నేను నటుడిగా సక్సెస్ అయ్యాక రాజకీయాలలోకి వచ్చాను. ఇది చూసి నా పిల్లలు సంతోషిస్తారని అనుకున్నాను. కాని రివర్స్ అయింది. వాళ్లు ఆ టైంలో నా పదవితో పాటు నన్ను కూడా అసహ్యించుకున్నారు. ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను. నా సినిమాలు చూస్తూ పెరిగిన వారు, నాతో పాటు సెట్స్‌లో ఆడుకునే వారు. వారికి ఆ వాతావరణం చాలా నచ్చింది. నేను సినిమాలు ఆపేసి హాలీవుడ్ నుండి దూరం చేయడం వాళ్లకు నచ్చలేదు. నేను గవర్నర్‌గా కాలిఫోర్నియాని అభివృద్ధి చేయలేదని వారు భావిస్తున్నారు. ఆ పరిస్థితుల గురించి నాకే తెలుసు అంటూ ఆర్నాల్డ్ ఎమోషనల్ అయ్యారు. ఈయన చివరిగా టర్మినేటర్ డార్క్ ఫేట్ లో కనిపించాడు.