గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 19:34:47

అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం..!

అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం..!

సందీప్ రెడ్డి వంగా..తొలి సినిమా అర్జున్ రెడ్డితో దేశ‌ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించాడు. తెలుగులో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. హిందీ వెర్ష‌న్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో స్టార్ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో చేరిపోయాడు సందీప్ రెడ్డి. ఈ ద‌ర్శ‌కుడు త‌న కొత్త చిత్రాన్ని హిందీలో లాంఛ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు బీటౌన్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న మూవీలో స్టార్ హీరో న‌టిస్తాడ‌ని తెలుస్తోంది.

సందీప్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట. ఓ ఆన్ లైన్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ..ఇప్ప‌టి నుంచి తాను తీయ‌బోయే సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌డమే కాకుండా నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తీసుకుంటునన్నాడు. త‌న సినిమా కోసం ఇత‌రులు (నిర్మాత‌లు) డ‌బ్బు పెట్టిన‌పుడు సృజ‌నాత్మ‌క స్వేచ్చ (క్రియేటివ్ ఫ్రీడ‌మ్‌) దొర‌కడం లేద‌ని అన్నాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి త‌న సోద‌రుడితో క‌లిసి నిర్మించిన విష‌యం తెలిసిందే. దీన్ని బ‌ట్టి సందీప్ రెడ్డి ఇక ఏ నిర్మాత‌ల‌తో సినిమాలు చేసే అవ‌కాశం లేద‌నిపిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.