అర్జున్ కపూర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం కీ అండ్ కా. ఈ చిత్రం ఐదేండ్లు పూర్తి చేసుకుంది. ఆర్ బాల్కి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది. కీ అండ్ కా బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అర్జున్ కపూర్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అర్జున్ కపూర్ చేతిలో మంగళసూత్రం పట్టుకున్న స్టిల్ ను పోస్ట్ చేస్తూ..సినిమా నుంచి జ్ఞాపకార్థంగా నిలిచిన వస్తువు అని చెప్పాడు అర్జున్ కపూర్. అంతేకాదు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని, ఒకసారి ఆలోచించాలని కరీనాకపూర్ ను అడిగాడు. కీ అండ్ కా చిత్రంలో అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్ కీ రోల్స్ పోషించారు. కీ అండ్ కాను తన తల్లి మోనా శౌరీ కపూర్‌కు అంకితమిస్తున్నట్టు చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..!
వెబ్‌సిరీస్‌పై అంచనాలు పెంచుతున్న తమన్నా
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!