గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 15:23:18

స‌హ‌చ‌ర న‌టుల‌కు క‌రోనా.. టెన్ష‌న్‌లో అర్జున్ రాంపాల్‌

స‌హ‌చ‌ర న‌టుల‌కు క‌రోనా.. టెన్ష‌న్‌లో అర్జున్ రాంపాల్‌

న్యూఢిల్లీ: స‌హ‌చ‌ర న‌టులు క‌రోనా బారిన‌ప‌డ‌టంతో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ టెన్ష‌న్ ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న అర్జున్ ఈరోజు క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాడు. ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి క‌ఠిన స‌మ‌యంలో ధైర్యంగా ఉండాల‌ని, త‌న స‌హ‌చ‌రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. 

ప్ర‌స్తుతం నెయిల్ పాలిష్ సినిమాలో న‌టిస్తున్న ఆయ‌న షూటింగ్ సంద‌ర్భంగా స‌హ‌చ‌ర న‌టులు మావ‌న్ కౌల్‌, ఆనంద్ తివారీల‌కు నిన్న‌ క‌రోనా నిర్ధార‌ణ అయ్యంది. దీంతో సినిమా యూనిట్‌ షూటింగ్‌ని నిలిపివేసింది. స్వీయ నిర్బంధంలో ఉన్న రామ్‌పాల్ వారితో స‌న్నిహితంగా మెలిగాన‌ని, దీంతో తానుకూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని వెల్ల‌డించాడు. ఫలితంకోసం ఎదురు చూస్తున్నాన‌ని తెలిపాడు. మాన‌వ్ కౌల్‌, ఆనంద్ తివారీ తొంద‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నాన‌ని చెప్పాడు. షూటింగ్ తొంద‌ర‌గా ప్రారంభం కావాల‌ని, మ‌ళ్లీ తామంతా క‌లిసి న‌టించాల‌ని కోరుకున్నాడు.   


logo