బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 14:55:41

న‌టుడు అర్జున్ క‌పూర్‌కు క‌రోనా పాజిటివ్

న‌టుడు అర్జున్ క‌పూర్‌కు క‌రోనా పాజిటివ్

ముంబై : బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు అర్జున్ క‌పూర్ ఇన్‌స్టాగ్రాం వేదిక‌గా వెల్ల‌డించారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ పాజిటివ్ వ‌చ్చింది. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. డాక్ట‌ర్లు, అధికారుల సూచ‌న మేర‌కు ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని తెలిపారు. మీ మ‌ద్ద‌తు కోసం ముందుగానే కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో త‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు అర్జున్ క‌పూర్. 


logo