బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో టామ్ అండ్ జెర్రీలా ఉంటూ ప్రేక్షకులని అలరించిన జంట అరియానా- సోహైల్. ఈ ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పొసగదు. ఎప్పుడు ఏదో విషయంపై గొడవ పడుతూనే ఉంటారు.అయితే ఓ సారి మాత్రం అరియానాకి ఎంతో ఇష్టమైన చింటు అనే టెడ్డీ బేర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో సోహైల్ నరాలు ఎక్కడ చిట్లి పోతాయో అనిపించింది.
అయితే చింటు వలన అంత పెద్ద గొడవ అయిన విషయాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్న సోహైల్ దాని మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు తాజాగా చింటును దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేస్తూ… ‘బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి’ అని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ జర్నీలో వీడు లేకపోయి ఉంటే నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. భషిష్యత్లో ఇంకెవరి మీద రివెంజ్ తీర్చుకోనని మాటిస్తున్నాను అంటూ సోహైల్ చెప్పుకొచ్చాడు. అయితే సోహైల్ పోస్ట్‌కి స్పందించిన అరియానా… ‘అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..’ అంటూ కూల్ వార్నింగ్ ఇచ్చింది.