మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 30, 2020 , 08:52:09

ఆడ‌వాళ్ళ మ‌ధ్య కెప్టెన్ పోటి.. విన్నర్‌గా లౌడ్ స్పీక‌ర్

ఆడ‌వాళ్ళ మ‌ధ్య కెప్టెన్ పోటి.. విన్నర్‌గా లౌడ్ స్పీక‌ర్

 బిగ్ బాస్ సీజన్ 4లో ఎపిసోడ్ 54 రంజుగా సాగింది. బుధ‌వారం రోజు బీబీ డే కేర్ టాస్క్‌కు ముగింపు ప‌లికిన బిగ్ బాస్ గురువారం రోజు కేవ‌లం ఆడవాళ్ళు  మాత్ర‌మే కెప్టెన్ టాస్క్‌లో పాల్గొనాల‌ని చెప్పారు.దీంతో అరియానా, మోనాల్‌, లాస్య‌, హారిక‌లో పోటీలో దిగారు.  అయితే ఎపిసోడ్ మొద‌ట్లో ఆర్ధ‌రైటిస్‌తో బాధ‌ప‌డుతున్న నోయ‌ల్ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి బాధ‌ప‌డుతూ క‌నిపించాడు. కీళ్ళ నొప్పుల‌ని త‌ట్టుకోలేక అటు ఇటు తిర‌గ‌సాగాడు. బాధను మరిచిపోవడానికి ‘సాగేనా ఈ పయనం ఆగేనా.. ఈ రాత్రి ఎట్టా గడిచేనా’ అని పాట పాడుతూ మైండ్ స్ట్రాంగ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు.  

ఇక లాస్య‌, నోయ‌ల్‌, అభిజిత్‌, హారికల బ్యాచ్ ఓ చోట చేరి ముచ్చ‌ట్లు పెట్ట‌డం స్టార్ట్ చేశారు.ఈ సారి మోనాల్ న‌డ‌క గురించి హేళ‌న చేస్తూ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా అభిజిత్‌.. మోనాల్ న‌డ‌క గురించి మాట్లాడుతూ ఆమె న‌డుస్తుంటే ఒంటె పెద్ద అడుగులు వేస్తూ ఎలా వెళుతుందో అలా అనిపిస్తుంది. ఆమెను చూస్తుంటే మంచి మ‌జా వ‌స్తుంది. నువ్వు ఒక‌సారి అబ్జ‌ర్వ్  చేయి అంటూ నోయ‌ల్‌కు చెప్పాడు.  

అనంత‌రం ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను ఆడ‌వాళ్ళ‌కు మాత్ర‌మే ఇవ్వ‌గా, ఈ టాస్క్‌లో మ‌గ‌వాళ్ళు టేబుల్‌పై ఉన్న కీస్ ద‌క్కించుకొని న‌చ్చిన వాళ్ళ‌కు ఇవ్వాలి. ఆ కీతో బాక్స్‌లోని క‌త్తిని తీసి కంటెస్టెంట్ ఫోటోతో ఉన్న‌యాపిల్‌ని క‌ట్ చేసి చిన్న చిన్న పీస్‌లు చేయాలి. దీంతో వారు కెప్టెన్సీ టాస్క్ నుండి వైదొలుగుతారు. మొద‌ట కీని అఖిల్ ద‌క్కించుకోగా, దానిని మోనాల్‌కు ఇచ్చాడు.  ఏడోవారంలో తనని నామినేట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈరకంగా సేవ్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్. 

మోనాల్ కెప్టెన్ పోటీదారుల‌లో ఒకరిగా ఉన్న హారిక‌ను ఎలిమినేట్ చేసింది. లాస్య‌, అభిజిత్‌, నోయ‌ల్‌ల స‌పోర్ట్ ఉంద‌ని , త‌ర్వాత అయిన కెప్టెన్ కావొచ్చు అంటూ ఆమెను కెప్టెన్సీ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయ‌డంతో హారిక చాలా ఫీలైంది.  నాకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదూ.. ఎప్పుడూ నా ఆట నేనే ఆడుతున్నా.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక రెండో సారి కీ ద‌క్కించుకొనే అవ‌కాశం మెహ‌బూబ్ కి రావ‌డంతో ఆ కీని అరియానాకి ఇచ్చాడు. ఓ సాని త‌న‌ని నామినేష‌న్ నుండి సేవ్ చేసింది కాబ‌ట్టి అరియానాకు ఇస్తున్నా అని చెప్పాడు. దీంతో ఈ సారి లాస్య‌ని కెప్టెన్సీ టాస్క్ నుండి త‌ప్పించింది అరియానా.

మూడో రౌండ్‌లో కీని రాజశేఖర్ మాస్టర్ దక్కించుకోవడంతో అతను కూడా అరియానాకి ఇచ్చాడు. దీంతో మోనాల్ ఫొటో ఉన్న యాపిల్‌కి కూడా కోసేసి హౌస్‌కి కెప్టెన్ అయ్యింది అరియానా. దీంతో అరియానాకి కెప్టెన్ బాండ్ అందించిన అవినాష్ ఆమెతో క‌లిసి సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నాడు. 


logo