గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 09:43:34

అభిజీత్‌, అఖిల్ మ‌ద్య గొడ‌వ‌.. వ‌ర‌స్ట్ కెప్టెన్‌గా అరియానా

అభిజీత్‌, అఖిల్ మ‌ద్య గొడ‌వ‌.. వ‌ర‌స్ట్ కెప్టెన్‌గా అరియానా

రేస్ టూ ఫినాలే మొదలైంద‌ని ఇందులో భాగంగా బెస్ట్ , వ‌ర‌స్ట్ కెప్టెన్ ఎవ‌రో చెప్పాల‌ని బిగ్ బాస్ అన‌డంతో హారిక‌ని బెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక వ‌ర‌స్ట్ కెప్టెన్ విష‌యంలో చ‌ర్చ రాగా, సోహైల్ .. అరియానా పేరు చెప్పాడు. ఆమె ర‌కెప్టెన్సీలో చాలా టార్చ‌ర్ చూశాన‌ని పేర్కొన్నాడు. ఇక అఖిల్ .. మోనాల్ విష‌యంలో ప‌నిష్మెంట్స్ సరిగా అమ‌లు చేయ‌ని కార‌ణంగా అత‌ను వ‌ర‌స్ట్ కెప్టెన్ అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. 

అవినాష్ కామెంట్స్‌కు బదులిచ్చిన అఖిల్ నేను ఎప్పుడు అంద‌రిని స‌మానంగా చూశా. ఎవ‌రిపై సింప‌థీ చూప‌లేదు అని అన్నాడు. ఇక త‌న దృష్టిలో వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ అవినాష్ అని చెప్పాడు అఖిల్‌. ఇక అరియానా సొహైల్‌ని వరస్ట్ కెప్టెన్ అని చెప్పుకొచ్చింది. అభిజిత్.. అఖిల్‌ని వరస్ట్ కెప్టెన్ అని, లక్ కొద్దీ కెప్టెన్ అయ్యాడని చెప్ప‌డంతో అఖిల్ ఫైర్ అయ్యాడు.

నువ్వు సోది క‌బుర్లు చెప్ప‌కు. ముందు నుండి నీ మైండ్‌లో ఒక‌టే ఉంది అంటూ అఖిల్ రెచ్చిపోతున్న స‌మయంలో సోహైల్ గొడ‌వ‌ని స‌ద్దుమ‌ణిగేలా చూశాడు. అయిన‌ప్ప‌టికీ అఖిల్ ఫైర్ కావ‌డంతో అభిజిత్ చ‌ల్ల‌బ‌డ్డాడు. దీంతో వివాదం స‌మ‌సింది. అంద‌రి ఏకాభిప్రాయం మేర‌కు అరియానాని వ‌ర‌స్ట్ కెప్టెన్‌గా ఫైన‌ల్ చేశారు . ఇక అవినాష్‌, అరియానా మ‌ధ్య కాసేపు చ‌ర్చ జ‌రిగింది. ఆ త‌ర్వాత ఎపిసోడ్‌కు శుభం కార్డ్ ప‌డింది 


logo