మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 23, 2020 , 09:13:41

అభిజిత్ బ‌ట్ట‌లా, రేష‌నా?.. అరియానాకు ప‌రీక్ష పెట్టిన బిగ్ బాస్

అభిజిత్ బ‌ట్ట‌లా, రేష‌నా?.. అరియానాకు ప‌రీక్ష పెట్టిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజ‌న్ 4కు సంబంధించి తాజాగా ప్ర‌సార‌మైన ఎపిసోడ్‌లో చివ‌రిగా అరియానాకు పెద్ద ప‌రీక్ష పెట్టారు బిగ్ బాస్. రేష‌న్ మేనేజ‌ర్‌గా ఉన్న అరియానాని స్టోర్ రూంలోకి పిలిపించిన బిగ్ బాస్ ఈ వారానికి సరిపడా రేషన్, అభిజీత్ నుంచి గతంలో తీసుకున్న బట్టలతో పాటు  ఇతర వస్తులను ఆమె ముందు ఉంచారు. ఇందులో ఒక‌టి ఎంపిక చేసుకోవాల‌ని అన్నారు. అయితే అభిజిత్ బ‌ట్ట‌లు లేక చాలా ఇబ్బంది ప‌డుతున్నాడు. ఈ వారం వ‌ర‌కు ఇవ్వ‌రా, లేదంటే సీజ‌న్ మొత్తం బ‌ట్ట‌లు ఇవ్వ‌రా అంటూ బిగ్ బాస్‌ని ప్ర‌శ్నించింది అరియానా.

అరియానా ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన బిగ్ బాస్.. రెండింట్లో ఏదో ఒక‌టి ఎంపిక చేసుకోవాల‌ని అన్నారు. దీంతో ఆమె హౌజ్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని రేష‌న్‌ప‌పై ఆస‌క్తి చూపింది. బ‌య‌ట నుండి అరియానాను గ‌మ‌నిస్తున్న ఇంటి స‌భ్యులు కూడా ఆమె నుండి ఇదే కోరుకున్నారు. చాలా మెచ్యూర్‌గా ఆలోచించి అరియానా తీసుకున్న నిర్ణ‌యంపై అభిజిత్‌తో పాటు ఇంటి స‌భ్యులు అంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

ఎంతో క్లారిటీతో గేమ్ ఆడుతూ వ‌స్తున్న అరియానాకు రేష‌న్‌నా, అభిజిత్ బ‌ట్టలా అని బిగ్ బాస్ చిక్కుముడి వేయ‌డంతో స‌రిగ్గా విప్పింద‌ని నెటిజ‌న్స్ కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే అభిజిత్‌కు తాను సాయం చేయ‌లేక‌పోయినందుకు సారీ చెప్పి రేష‌న్ తీసుకువ‌చ్చింది అరియానా . ఇక‌ రాత్రిపూట హారిక అద్దంపై తాను బిగ్‌బాస్ విన్న‌ర్ అని రాసుకుని మురిసిపోయింది. అనంత‌రం  అఖిల్‌, మోనాల్‌ల మ‌ధ్య కొద్ది సేపు సీరియ‌స్ డిస్క‌ష‌న్ జ‌రిగింది. అభిజిత్‌తో అఖిల్ మాట్లాడ‌డంపై మోనాల్ కొంత హ‌ర్ట్ అయిన‌ట్టు క‌నిపించ‌డంతో దానిపై పూర్లి క్లారిటీ ఇచ్చాడు అఖిల్. 


logo