శనివారం 06 మార్చి 2021
Cinema - Dec 15, 2020 , 10:46:41

సోహైల్‌లో ఆవేశంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే: అరియానా

సోహైల్‌లో ఆవేశంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే: అరియానా

ఇన్నాళ్ళు క‌లిసి జ‌ర్నీ చేయ‌డంతో అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో అంద‌రికి అర్దం అయ్యాయి. దీంతో ఒక‌రి గురించి ఒకరు మాట్లాడారు. అరియానా మాట్లాడుతూ.. సోహైల్‌కు ఎంత కోపం వ‌స్తుందో, అంత క‌న్నా ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌తాడు. చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం మ‌న‌సులో ఏది పెట్టుకోడు అని స్ప‌ష్టం చేసింది. ఇక సోహైల్‌.. అరియానా లోప‌ల ప్రేమ చాలా ఉంటుంది. అది పెద్ద‌గా బ‌య‌పెట్ట‌దు అని అన్నాడు.

అభి గురించి మాట్లాడిన అఖిల్‌... అభి ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్, కాని దానిని పెద్దగా బ‌య‌ట‌పెట్ట‌డం లేదు అని అన్నాడు. అఖిల్ గురించి మాట్లాడిన హారిక‌.. మోనాల్ వెళ్ళిన త‌ర్వాత అఖిల్ ఏంట‌నది అర్దం అయింది. అత‌నికి స‌పోర్ట్‌గా ఒకరు ఉండాలి అని పేర్కొంది. ఇక అభిజిత్‌.. హారిక గురించి మాట్లాడుతూ ఆమె లోప‌ల దాచి ఉంచిన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌దు. నా క‌న్నా ఇగో ఎక్కువ అని అన్నాడు. మోనాల్, స్వాతి, అరియానాల‌ని పొగిడితే ర‌చ్చ చేసేద‌ని అన్నాడు.

VIDEOS

logo