శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 10:03:11

బిగ్‌బాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అరియానా

బిగ్‌బాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అరియానా

టిక్కెట్ టూ ఫినాలే మెడ‌ల్ ద‌క్కించుకునేందుకు హౌజ్‌మేట్స్ హోరాహోరీగా టాస్క్‌లు ఆడారు. అయితే అఖిల్‌, సోహైల్‌లు ఇద్ద‌రు క‌లిసి ప‌క్కా స్కెచ్‌తో గేమ్ ఆడుతూ వ‌స్తున్నారు. బుధవారం రోజు బిగ్ బాస్ ఇది వ్య‌క్తిగ‌త గేమ్ అని చెప్ప‌డంతో అరియానా ఆవేశం క‌ట్టలు తెంచుకుంది. ముందు రోజు ఇది ఎందుకు చెప్ప‌లేదు అంటూ ఫుల్ ఫైర్ అయింది. వ్య‌క్తిగ‌తంగా ఆడి ఓడిపోయాను. ఈ టాస్క్‌లు ఆడ‌డం నాకు చాలా ఇష్టం. ఇది కెమెరా ఫుటేజ్ కోసం కాదు మీకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం. న‌న్ను బ‌య‌ట‌కు పంపిన ప‌ర్వాలేదు అంటూ అరియానా మ‌న‌సులో బాద‌ను అంతా కక్కేసింది.

అరియానాకి అవినాష్ కూడా జ‌త అయి బిగ్ బాస్ మీ నిర్ణ‌యాలు బాలేదంటూ వాపోయాడు. అనంత‌రం పూలు ప‌ట్టుకొనే టాస్క్‌లో సోహైల్, అభిజీత్‌, అఖిల్ పాల్గొన‌గా అభిజీత్‌కు హారిక‌, అరియానా, అవినాష్ సపోర్ట్ చేశారు. అయిన‌ప్ప‌టికీ అభిజీత్ త‌క్కువ పూల కౌంట్‌తో ఓడిపోయాడు. టిక్కెట్ టూ ఫినాలే రేసు నుండి త‌ప్పుకున్నాడు. దీంతో ఆట‌లో సోహైల్, అఖిల్ ఉండ‌గా వీరిద్దరికి సంబంధించిన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్ర‌కారం ఊయ‌ల‌లో ఎక్కువ సేపు ఎవ‌రు కూర్చుంటారో వారే విజేత‌లుగా నిలుస్తారు అని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. మ‌రి ఇందులో విజేత ఎవ‌ర‌నేది నేడు తేల‌నుంది.