మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 20, 2020 , 09:02:41

మాది ప‌న్నెండేళ్ళ స్నేహం.. దొంగ‌త‌నంగా వాళ్ళింట్లో అన్నం తిన్నా: అరియానా

మాది ప‌న్నెండేళ్ళ స్నేహం.. దొంగ‌త‌నంగా వాళ్ళింట్లో అన్నం తిన్నా: అరియానా

బిగ్ బాస్ సీజ‌న్ 4లో గురువారం ఎపిసోడ్ కూడా ఎమోష‌న‌ల్‌గా సాగింది. తాజా ఎపిసోడ్‌లో మోనాల్ సోద‌రి, అరియానా ఫ్రెండ్‌, సోహైల్ తండ్రి ఇంట్లోకి ప్ర‌వేశించారు. వారిని చూసి మురిసిపోయారు. ఎపిసోడ్ మొద‌ట్లో అఖిల్, మోనాల్‌లు గార్డెన్ ఏరియాలో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించుకున్నారు. ఇందులో భాగంగా మోనాల్‌తో అఖిల్ త‌ల్లి సరిగా మాట్లాడ‌క‌పోవ‌డంపై డిస్క‌ష‌న్ జ‌రిగింది. మా అమ్మ చాలా పొసెసివ్ అందుకే ఎక్కుమ మాట్లాడ‌లేదు అని అఖిల్ అన్నాడు. ఆ త‌ర్వాత క‌మాండ్స్ ట్రైనింగ్ సెంట‌ర్‌ గేమ్ భాగంగా ఇంటి స‌భ్యులు టాస్క్‌లు చేశారు. అవినాష్ కొద్దిసేపు మోనాల్‌, కొద్ది సేపు అరియానాతో పులి హోర క‌లిపాడు. 

అందరు ఫ్రీజ్ అయిన స‌మ‌యంలో అరియానా ఫ్రెండ్ వినీత్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అత‌డిని చూసి హౌజ్ ద‌ద్ద‌రిల్లేలా అరిచింది. అంద‌రి క్షేమ స‌మాచారాలు తెలుసుకున్న త‌ర్వా త నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు వ‌చ్చినందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది అరియానా. తొమ్మిదో త‌ర‌గ‌తి నుండి మా ఇద్ద‌రిది ఫ్రెండ్షిప్ అంటూ అత‌నిని హౌజ్‌మేట్స్‌కు ప‌రిచ‌యం చేసింది. నాకు చాలా సంద‌ర్భాల‌లో అండ‌గా ఉన్నాడు. కొన్ని సందర్బాల్లో మా అమ్మలేదు.. చెల్లి లేదు.. ఇతనే ఉన్నాడు. అన్నంలేని టైంలో కూడా దొంగతనం వెళ్లి వీళ్ల ఇంట్లో అన్నం తినేదాన్ని.. పాపా ఇంటికి రా అన్నం తిను అని వండిపెట్టేవాడు అని అరియానా చెప్పుకొచ్చింది. 

బిగ్ బాస్‌కు నువ్వు వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని అరియానా చెప్ప‌డంతో వినీత్.. మీ చెల్లెలితో కొట్లాడి వచ్చా అన్నాడు. ఇక బిగ్ బాస్ 3 స‌మయంలో వారిద్దరు క‌లిసి ఉన్న‌ప్ప‌టి విష‌యాన్ని గుర్తి చేసింది. పాప నువ్వు బిగ్ బాస్‌కు వెళితే డొక్కు కారు అద్దెకు తెచ్చి డ్యాన్స్ చేయిస్తా అన్నావు గుర్తుందా? అని అడిగింది అరియానా. దీనిని త‌ప్ప‌క నెర‌వేరుస్తానంటూ వినీత్ చెప్పుకొచ్చాడు


logo