గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 08:37:49

మోనాల్‌, అఖిల్‌ల‌కు ప్రేమ మొద‌లైందా ?

మోనాల్‌, అఖిల్‌ల‌కు ప్రేమ మొద‌లైందా ?

బిగ్ బాస్ సీజ‌న్‌4ని హోస్ట్ చేస్తున్న నాగార్జున ఈ సారి అందుబాటులో  లేక‌పోవ‌డంతో నిర్వాహ‌కులు స‌రికొత్త‌గా ఆలోచించి బీబీ స్టార్ అవార్డ్స్ వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుక కోసం అంద‌రు టిప్‌టాప్‌గా రెడీ అయ్యి వేడుక‌లో పాల్గొన్నారు. ఈ వేడుక‌లో ప్రేమ మొద‌లైంది అనే టైటిల్‌తో తెర‌కెక్కించిన బిగ్ బాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని ప్ర‌ద‌ర్శించ‌గా, ఇది చూసి హౌజ్‌మేట్స్ అంద‌రు ఎమోష‌న‌ల్ అయ్యారు. ప్రేమ మొద‌లైంది చిత్రానికి  అభిజీత్ దర్శకుడిగా, అవినాష్ స్క్రిప్ట్ రైటర్‌గా, నోయల్ డీఓపీగా, అఖిల్ హీరోగా, మోనాల్ హీరోయిన్‌గా, అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్‌గా వారివారికి ఇచ్చిన పాత్ర‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించారు

 బీబీ స్టార్ అవార్డ్స్ వేడుక‌లో పాల్గొనే ముందు అంద‌రిని ఇంట‌ర్వ్యూ చేసిన అరియానా ఎవ‌రు బాగా మాట్లాడారో వారిరికి కూల్ డ్రింక్ బాటిల్స్ అందించింది.  అయితే ప్రేమ మొద‌లైందా అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు అడ‌గ‌గా, ముందుగా మోనాల్‌.. నిజంగా మొద‌లు కాలేదు, ఇప్పుడు చెప్తే ఫీల‌వుతారు అంటూ మాట్లాడింది. ఇక అఖిల్‌ని ఇంట‌ర్వ్యూ చేసిన అరియానా.. ప్రేమ మొద‌లైంది అని టైటిల్ పెట్టారు క‌దా?  మీకు బీబీ హౌజ్‌లో ప్రేమ మొద‌లైందా, ఏమైన చిగురిస్తున్నాయా అని అడిగింది. దీంతో అఖిల్ ఇక్కడ నాలో ప్రేమ మొదలైంది.. బయట ప్రేక్షకుల్లో కూడా నా మీద ప్రేమ మొదలైంది. బంధాలు, అనుబంధాలు అవన్నీ ఉండాలి కాబట్టి చిన్న చిన్న ప్రేమలు ఇక్కడ చాలా ముఖ్యం. ప్రేమల కారణంగానే బయట ఉన్న ప్రేక్షకులు ఇక్కడి వరకు నన్ను తెచ్చారు అంటూ తెలివిగా స‌మాధానం ఇచ్చారు.