శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 13:28:03

గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !

గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !

బిగ్ బాస్ షోకు రాక‌ముందు యాంక‌ర్‌గా పని చేసిన అరియానా పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిందో ఈ అమ్మ‌డి క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది. ముక్కుసూటిగా మాట్లాడుతూ అవ‌త‌లి వారిని వ‌ణికించిన అరియానా టాప్ 5లోను నిలిచింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన అరియానాకు చాలానే ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది.

అరియానా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది. హీరో రాజ్ త‌రుణ్, ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి(సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్)తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లో ఎగ్జైటింగ్ వార్త రానుంది. బిగ్ బాస్ త‌ర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గ‌విరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ  రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అని కామెంట్ పెట్టింది.అలానే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌ ‌ని హ్యాష్ ట్యాగ్‌తో జ‌త చేసింది. ఇవి చూస్తుంటే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అరియానా ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు అర్ద‌మ‌వుతుంది. మ‌రి ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుందా, లేక కీల‌క పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

VIDEOS

logo