శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 11:02:01

ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌.. న్యూ లుక్‌లో బ‌న్నీ కూతురు

ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌.. న్యూ లుక్‌లో బ‌న్నీ కూతురు

వెండితెర ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ పొందిన చిన్నారి అల్లు అర్హ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి.. అర్హ‌కు సంబంధించిన ఫోటోల‌ని, వీడియోల‌ని త‌ర‌చు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ రోజు ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అర్హ‌ని రెడీ చేసి సోష‌ల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. అలాగే అల్లు అయాన్ అయితే మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డిగా తయారు అయ్యి ఏకంగా సైరా లో మెగాస్టార్ ను తలపించాడు. 

మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అర్హ చెబుతున్న‌ సత్యమే వజయతే అనే నినాదం నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. కాగా, అల్లు అర్జున్ కూడా త‌న కూతురుకి సంబంధించిన వీడియోలు త‌ర‌చు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మ‌ధ్య అల వైకుంఠ‌పుర‌ములోని రాములో రాములో సాంగ్‌ని అర్హ దోశె స్టెప్ అంద‌ని చెబుతూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన విష‌యం తెలిసిందే. బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. 

logo