సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిన్నారులు నెటిజన్స్‌కు చాలా సుపరిచితం. పిల్లలకు సంబంధించిన ఫొటోలు లేదంటే వీడియోలని నిత్యం వీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో అవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు చిన్న వయస్సులోనే వారు సెలబ్రిటీలుగా మారారు. పిల్లల క్యూట్ పిక్స్ ఏవైన సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయంటే వాటిని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
తాజాగా బన్నీ సతీమణి స్నేహా రెడ్డి తన కూతురు అర్హ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ క్యూట్ పిక్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బేబి పింక్ కలర్ స్టర్క్లో అర్హ అమాయకపు చూపులు అందరిని కట్టిపడేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే బన్నీ ఇటీవలే కరోనా నుండి కోలుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత ఆయన పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నారు.