ఆర్చర్ లక్ష్యం

నాగశౌర్య కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రానికి ‘లక్ష్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. కేతిక శర్మ కథానాయిక. టైటిల్‌ను చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రాచీన విలువిద్య ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. క్రీడా నేపథ్యానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. విజయం కోసం విలువిద్య క్రీడాకారుడు సాగించే ప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది. ఇందులో ఎయిట్ ప్యాక్ లుక్‌తో నాగశౌర్య కొత్త పంథాలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు’ అని తెలిపారు. సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి.
తాజావార్తలు
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం