బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 16, 2020 , 12:12:26

క‌రోనా ఎఫెక్ట్ : రానా 'అర‌ణ్య' విడుద‌ల వాయిదా

క‌రోనా ఎఫెక్ట్ : రానా 'అర‌ణ్య' విడుద‌ల వాయిదా

క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ నెల‌లోనే కాదు వ‌చ్చే నెల‌లో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న సినిమాలు కూడా వాయిదా ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వం థియేట‌ర్స్ మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో  ఈ వారంలో రిలీజ్ కావ‌ల‌సి ఉన్న కొన్ని చిత్రాలు వాయిదా ప‌డ్డాయి. తాజాగా రానా హీరోగా తెర‌కెక్కిన అర‌ణ్య మూవీ కూడా వాయిదా ప‌డింది. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని కొద్ది రోజులు వాయిదా వేశారు. మంచి కంటెంట్‌తో త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తామ‌ని ఈరోస్ సంస్థ తెలిపింది. 

రానా ప్ర‌ధాన పాత్ర‌లో  ప్రభు సాల్మన్ తెర‌కెక్కించిన చిత్రం ‘అరణ్య’ .  త్రిభాషా చిత్రం రూపొందిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో ,  తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల చేయ‌నున్నారు.  చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ చిత్రంలో రానా  అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా క‌నిపించ‌నున్నాడు. జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది.  


logo