ఆదివారం 23 ఫిబ్రవరి 2020
గిరిజ‌న రైతు జీవిత నేప‌థ్యంలో 'అర‌ణ్య‌'

గిరిజ‌న రైతు జీవిత నేప‌థ్యంలో 'అర‌ణ్య‌'

Feb 15, 2020 , 09:28:48
PRINT
గిరిజ‌న రైతు జీవిత నేప‌థ్యంలో 'అర‌ణ్య‌'

రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం అర‌ణ్య‌. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లైంది. ఇందులో రానా ఆదివాసిగా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచాడు. చిత్రాన్ని ఏప్రిల్ 2న తెలుగులో అర‌ణ్య పేరుతో విడుద‌ల చేయ‌నుండ‌గా, తమిళంలో ‘కాండన్‌', హిందీలో ‘హాథీ మేరే సాథి’ పేరుతో  రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఈ చిత్రం అస్సాంకు చెందిన జాదవ్ పయెంగ్ అనే పర్యావరణవేత్త మరియు గిరిజన రైతు ఆధారంగా రూపొందించిన‌ట్టు రానా పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా మొక్కలు నాటడం ద్వారా 1,300 హెక్టార్ల బంజరు, ఉపయోగించని భూములను అడవులుగా మార్చినందుకు జాదవ్‌కు గౌరవనీయమైన పద్మశ్రీ అవార్డు లభించిందనే విష‌యం కూడా తెలియ‌జేశారు. ఆరణ్య జీవితానికి నిజమైన అర్ధాన్ని నేర్పింది.  థాయ్ లాండ్ షెడ్యూల్‌లో జాయిన్ అయిన త‌ర్వాతే నా పాత్ర ఏంటో తెలిసింది. మొబైల్స్ లేకుండా, ప్ర‌పంచానికి దూరంగా ఉన్న‌ప్పుడు నేనేంటో నాకు తెలిసిందని రానా స్ప‌ష్టం చేశారు.  logo